Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనుబొమలు చేయించుకున్నప్పుడు కొంతమందికి వాటి దగ్గర మంట, నొప్పిగా ఉంటుంది. అటువంటి సమయంలో ఇయర్ బడ్స్‌ను ఆలివ్ నూనెలో ముంచి కనుబొమల మీద నెమ్మదిగా మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- కండ్ల కింద మచ్చలు, వాపులు కనిపించకుండా ఉండేందుకు కన్సీలర్ వాడుతుంటాం. ఆ కన్సీలర్ శుభ్రం చేసుకునేందుకు ఇయర్ బడ్ను వాడుకోవచ్చు.
- కాటుక పెట్టుకునేటప్పుడు సరిగా రాకపోతే దానిని తుడిచేందుకు ఇయర్ బడ్ ఉపయోగించవచ్చు. మేకప్ వేసుకునేందుకు బ్రష్‌లా వాడొచ్చు.
- ముక్కు, కనుబొమల మధ్యలో ఫౌండేషన్, పౌడర్ సరిగ్గా అంటుకోదు. అలాంటప్పుడు ఇయర్ బడ్స్‌తో ఫౌండేషన్ వేసుకుంటే బాగుంటుంది.
- గోళ్ల రంగు వేసుకునేటప్పుడు ఒక్కోసారి చర్మం మీద రంగు అంటుకుంటుంది. అప్పుడు ఇయర్ బడ్‌తో దాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.