Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లో అందరికన్నా ముందు నిద్రలేచి చివరగా నిద్రకు ఉపక్రమించేది మహిళలే. విశ్రాంతి తీసుకునే ఆ కాస్త సమయంలోనూ నిద్ర పట్టక అవస్థపడుతుంటారు. నిద్రలో సేదతీరితేనే మరుసటిరోజు ఉత్సాహంగా ఉంటుంది. నిద్రపై జరిగిన అనేక పరిశోధనల ఫలితంగా కొన్ని రకాల ఆహారం మంచి నిద్రకు ఉపయోగపడుతాయని స్పష్టమైంది. నార్డ్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో నిద్రపుచ్చే కొన్ని ఆహారపదార్థలు వివరాలు తెలిసాయి..
- జీర్ణశక్తిని మెరుగుపరిచే అరటిపండ్లు నిద్రలేమి సమస్యను కూడా దూరం చేస్తాయి. అరటిపండ్లలో అధికంగా ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మపోషకాలు త్వరగా
నిద్రపట్టేలా చేస్తాయి.
- మెగ్నీషియం శాతం బాదంలో అధికంగా ఉంటుంది. ఇది మంచినిద్రను ఇస్తుంది. అంతేకాదు నిద్రిస్తున్న సమయంలో రక్తంలోని చక్కెరస్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
- చెర్రీస్‌లో ఉండే స్మూక్ష్మ పోషకాలు మెదడులోని పీనియల్ గ్రంధి ఉత్పత్తి చేసే మెలటోనిన్ హార్మోన్‌గా పనిచేస్తాయి. త్వరగా నిద్రపుచ్చడంతో పాటు నిద్ర పోయే సమయాన్ని కచ్చితంగా పాటించేలా చేస్తాయి. అంతర్గత గడియారంగా పనిచేస్తూ.. శరీరధర్మక్రియలను నియంత్రిస్తాయి.
- బెడ్‌పైకి వెళ్లడానికి ముందు వెచ్చని పాలు తాగితే నిద్రలోకి జారుకోవడం చాలా సులభం. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనోఆమ్లం సెరోటోనిన్గా మారుతుంది. ఇది మెదడుపై ప్రభావం చూపించి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది.
- అవిసెగింజలు నిద్ర లేమిని దూరం చేస్తాయి. ఇందులో మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటాయి. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించేలా అధికంగా ఫైబర్ ఇందులో ఉంటుంది. అలసటను దూరం చేసే అద్భుతమైన ఔషధంగా వీటిని చెప్పవచ్చు. రాత్రివేళ తీసుకునే ఆహారంలో అవిసెగింజలను చేర్చితే నిద్రబాగా పడుతుంది.