Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లి తన బిడ్డను నిద్రపుచ్చడానికి పాడే లాలిపాటతో బోలెడు లాభాలున్నాయి అంటున్నారు మియామీ యూనివర్శిటీ పరిశోధకులు. సుమారు వంద మంది పసిపిల్లల మీద పరిశోధనలు నిర్వహించిన అనంతరం పరిశోధకులు వెల్లడించిన వివరాలు ఆసక్తిగా ఉన్నాయి. పసిపిల్లలకు పది రకాల గొంతులు వినిపించారు. అందులో తల్లి పాడే లాలిపాటకే బిడ్డ మెదడు ఎక్కువగా ప్రతిస్పందించడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆ పాట వింటున్న సమయంలో వారి మెదడు మరింత చురుకుగా పనిచేయడాన్ని కూడా గమనించారు. అదే విధంగా బిడ్డ కోసం పాడే లాలిపాట తల్లికి కూడా ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. లాలిపాట పాడుతూ తల్లి అప్పటి వరకూ పడిన శ్రమనూ, మానసికఒత్తిడిని మరిచిపోవడాన్ని కూడా ఈ పరిశోధనలో గుర్తించారు. పిల్లల పెంపకంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటి నుంచి తల్లి లాలిపాట పాడడం ద్వారా సాంత్వన పొందుతుందని వారు అంటున్నారు. పిల్లల కోసం తల్లి పాడే లాలిపాటతో ఎన్నో లాభాలున్నాయని, తల్లిబిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుందని ఈ పరిశోధనల ద్వారా వెల్లడైంది. ణ