Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గర్భవతులు ప్రసవం గురించి ఆందోళన చెందుతుంటారు. వీరు ప్రాణాయామం, యోగాసనాలు చేసే సహజప్రసవం అవుతుంది. అంతేకాదు గర్భాధారణ సమయంలో కలిగే మానసిక ఒత్తడి నుంచి ఉపశమనం కలుగుతుంది. గర్భవతులు వేసే ఆసనాలు ప్రత్యేకంగా ఉంటాయి. పొట్టపై ఒత్తిడి పడకుండా ఆసనాలు వేయాలి. ఇందులో బద్దకోణాసనం ఒకటి. ఈ ఆసనాన్ని గర్భవతులు సులభంగా చేయవచ్చు.
బద్దకోణాసనం..
కాళ్లను చాపి కూర్చోవాలి. మెల్లగా మోకాళ్ల దగ్గర మడిచి వెన్నెముక, తల నిటారుగా ఉంటాలి. పాదాల అరికాళ్లని ఒకదానితో మరొకటి తాకేలా ఉంచాలి. చేతులతో రెండు పాదాలను పట్టుకోవాలి. మోకాళ్లని, తొడలని పైకికిందికి నెమ్మదిగా కదపాలి. మోకాళ్లతో నేలను తాకడానికి ప్రయత్నించాలి.
ఉపయోగాలు..
1. సహజప్రసవం జరుగుతుంది.
2. రక్తపోటు అదుపులో ఉంటుంది.
3. తొడ కండరాలు బలంగా అవుతాయి.
4. గర్భాధారణ కారణంగా వచ్చే కాళ్లనొప్పులు తగ్గుతాయి
5. కటి ప్రదేశంలో, కాళ్లలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
జాగ్రత్తలు..
గర్భవతులు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి. యోగా నిపుణుని పర్యవేక్షణలో చేయాలి. ఈ ఆసనం ఐదోనెల నుంచి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
శ్రీచందన
డిజె ఫిట్నెస్ హబ్
9666665458