Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొద్దిసేపు సైక్లింగ్, చిన్నపాటి శారీరక వ్యాయామం చేయటం ఒత్తిడిని తగ్గిస్తాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోవడం, ధ్యానం, అవసరమైతే వైద్యులను సంప్రదించి కొద్దిపాటి మందులు వాడుతూ ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు విటమిన్ల లోపం కూడా ఒత్తిడికి కారణం కావొచ్చు. ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. చుట్టూ ఉన్న పరిసరాల్లోని చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని కలిగించి ఒత్తిడిని దూరం చేసేవి చాలా ఉంటాయి. ఉదయిస్తున్న సూర్యుడు, వికసిస్తున్న పూలు, ఆడుకుంటున్న పిల్లలను చూడటం, చల్లగాలిని ఆస్వాదించడం, శ్రేయోభిలాషులతో కాసేపు మాట్లాడటం, ఆహ్లాదకరమైన సంగీతం వినడం ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేసేవే. సానుకూల దక్పథంతో ఉండాలి. ఆ దిశగా ఆలోచనలను మళ్లించాలి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి అన్నింటికంటే బాగా పనిచేసే మందు.
చాలామంది అర్ధరాత్రి దాటాక కూడా చదువుతూ, ఇతర పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు త్వరగా అలసటకు గురవుతారు. అంతేకాదు ఉదయం పూట కునుకు పడుతుంటారు. అలాగే వివిధ రకాల పనుల వల్ల కూడా తరచూ నిద్రలేమికి గురవుతుంటారు. అటువంటి సమయంలో అలసటకు లోనై ఆలోచనలు బలహీనపడతాయి. చేసే పని మీద ఏకాగ్రత ఉండదు. తప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయాన్ని చదువుకోసం కేటాయించడం వల్ల నిద్రలేమి సమస్య బాధిస్తుండటం సహజమే! మరికొంత మంది ఒత్తిడి వల్ల ఎక్కువ నిద్రపోలేరు. దీనికి కనీస సమయమైనా నిద్రపోవడం తప్ప వేరే మార్గం లేదు. నిద్రలేమి ప్రభావం మానసిక, శారీరక ఆరోగ్యాల మీద తప్పకుండా పడుతుంది. కాబట్టి వయసుని బట్టి తగినన్ని గంటలపాటు నిద్రపోవాలి. ఒత్తిడితో, ఆందోళనతో నిద్ర పట్టనివారు ఒత్తిడిని జయించే కొన్ని ఎక్సర్సైజ్లు చేయడం వల్ల దీన్ని అధిగమించవచ్చు. ు