Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాపిల్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగ పడుతుంది. యాపిల్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా...
చర్మం జిడ్డుగా ఉండేవారికి యాపిల్ బాగా ఉపయోగపడుతుంది. జిడ్డుగా ఉన్న ముఖానికి - యాపిల్ యాపిల్ గుజ్జును పట్టించి 15 నిమిషాల తర్వాత కడుక్కుంటే జిడ్డు వదిలి ముఖం అందంగా తయారవుతుంది.
- కొంచెం యాపిల్ తురుముని చేతిలోకి తీసుకొని అందులోకి తగినంత తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం మృదువుగా, కోమలంగా కనిపిస్తుంది.
- ఒక యాపిల్ ని సన్నగా తురుముకోవాలి. తురుముకున్న యాపిల్ ముక్కల్ని రెండు చెంచాలు తీసుకొని అందులో ఒక చెంచా దానిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
- యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం, వెంట్రుకల నాణ్యతను పెంచి మరింత అందంగా తయారు చేస్తుంది. ముఖ్యంగా ఇది ముఖంపై ఉండే మచ్చలను తొలగించడం, గాయలు మాన్పించడం, వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది.
- రెండు గ్లాసుల నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలపాలి. మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత కాటన్ బల్బ్స్ సహాయంతో ముఖానికి శుభ్రం చేసుకోవాలి. తర్వాత కాటన్ బల్బ్స్ సహాయంతో ముఖానికి ఆఫ్లై చేసుకోవాలి. మిశ్రమంలో ఉండే అల్ఫా హైడ్రాక్సీ, ఎసింథిక్ యాసిడ్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
- ఒక బకెట్ వేడి నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలపడం ద్వారా చర్మంలో ఉండే పీహెచ్ లెవల్స్ సమతుల్యంగా ఉంటాయి.
- యాపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి షాంపూలాగా కూడా ఉపయోగించవచ్చు. ఇది చుండ్రును నివారిస్తుంది. దాంతోపాటు వెంట్రుకలు మృదువుగా, పొడవు పెరిగేలా చేస్తుంది.