Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడైనా మంచి పుస్తకం కనిపిస్తే చాలు కొనేయడం...చదివిన తర్వాత దాన్ని ఎక్కడో ఒక చోట పడేయడం..మామూలే! తర్వాత ఎప్పుడైనా అదే పుస్తకం అవసరమొచ్చి వెతికితే తొందరగా దొరకదు. ఎక్కడ ఉంచామో గుర్తుండదు. ఇలా కాకుండా ఇంట్లోనే వాటిని ఒక క్రమ పద్దతిలో అమర్చుకుని చిన్న పాటి గ్రంథాలయంలా ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి పుస్తకం అవసరమైనా వెంటనే తీసుకోవడం సులభమవుతుంది. చూడటానికి కూడా బావుంటుంది...
- చదివిన పుస్తకాలను ఉంచడానికి ఇంట్లో అల్మారాలు ఎక్కువగా ఉండే గదిని కేటాయించుకోండి. లేదా మార్కెట్లో లభ్యం అవుతున్న బుక్ షెల్ఫ్స్ని కొనుక్కోండి.
- మీ దగ్గరున్న పుస్తకాలన్నీ పెట్టుకోవడానికి సరిపడే దాన్ని ఎంపికచేసుకోవడం మరవకండి. అల్మారాలలో చదివిన పుస్తకాలను లోపలివైపు, చదవాల్సిన పుస్తకాలను బయటివైపు ఉంచుకుంటే తీసుకోవడం చాలా తేలిక అవుతుంది.
- ఇందులో ఇతర వస్తువులేవీ ఉంచకుండా జాగ్రత్తపడాలి. అలాగే పుస్తకాలు విభాగాల వారిగా సర్దుకుంటే తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇలా చేస్తే మీకు ఇష్టమైన పుస్తకాలు ఎక్కడ పెట్టారో అవసరమైనపుడు మర్చిపోకుండా చూసుకోవచ్చు.