Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతిమరుపు సమస్య సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యేదే. అయితే కొంతమంది రెండు రోజుల కిందట కలిసిన వారి పేర్లను ఇట్టే మర్చిపోతుంటారు. కొన్ని తెలివైన పద్ధతులు మిమ్మలి ఈ మతిమరుపు సమస్య నుండి బయటపడేస్తాయి. దాంతో మిమ్మల్ని మీరు తిట్టుకోవల్సిన అవసరం కూడా ఉండదు. ఈ సారి వాళ్ళను కలిసినపుడే అటువంటి పద్ధతులను అనుసరించండి.
మీకు పరిచయమైన వారి పేరును గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి మార్గం ఏమిటంటే వారి పేరును పెద్దగా పలకడం. ఎందుకంటే మీరు ఆ పేరును పెద్దగా పలికినపుడు అది మీ మెదడుకు త్వరగా చేరుతుంది. తర్వాత మర్చిపోయే అవకాశం ఉండదు.
ఉదాహరణకు మీరు స్వాతి అనే వ్యక్తిని కలుసుకున్నారనుకోండి
ఎలా ఉన్నావు స్వాతి?
ఈ రోజు నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది?
హారు స్వాతి, నేను కల్పనను మాట్లాడుతున్నా..అంటూ మాటలు కలపండి.
గుర్తుంచుకోడానికి రెండు విషయాలు
ఒకటి, మీరు ఆ పేరు ఏ సందర్భంలో విన్నారు
రెండు, ఆ పేరు ఏ సందర్భంలో పలికారు
ఈ పద్ధతులను మీరు ఆచరిస్తే కొంత కాలానికి అలవాటవుతుంది. తర్వాత మీరు మీకు పరిచయమైన వారి పేర్లను మర్చిపోలేరు. అప్పుడు మీరు వారిని ఎక్కడైనా కలిసినపుడు ఏంచక్కా పేర్లతో పిలుస్తూ పలకరించవచ్చు.