Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది తీర్థయాత్ర కావొచ్చు, విహార యాత్ర కావొచ్చు.. ప్రయాణం సజావుగా సాగాలంటే కొన్ని వద్దనుకోవాలి. అవగాహన లేకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వల్ల ప్రయాణ భారం పెరిగే అవకాశం ఉంది. బ్యాగు భారం తగ్గించుకునే మార్గాలివి..
- కుటుంబంతో ప్రయాణం అనగానే నాలుగైదు బ్యాగులు సిద్ధమైపోతాయి. అవసరం లేని దుస్తులు కూడా చాలా పెట్టేస్తారు. ఎన్ని రోజుల ప్రయాణం, ఎక్కడికి వెళ్తున్నాం.. ఈ విషయాలను దష్టిలో ఉంచుకొని దుస్తులు సర్దుకోవాలి. విహారానికి వెళ్తూ తీసుకెళ్లే బ్యాగులో సగం ఖాళీగా ఉండాలని నిపుణుల మాట. దీనిని పాటిస్తే మంచిది.
- నాలుగైదు జీన్స్ ప్యాంట్లు, రెండు మూడు షార్ట్స్‌తో లగేజీ పెంచేయకండి. నాలుగైదు రోజుల పర్యటనకు వెళ్తున్నట్టయితే.. రెండు జీన్స్ ప్యాంట్లు, రెండు షార్ట్స్, రెండు జతల టీషర్ట్స్ పెట్టుకుంటే చాలు.
- ఏ వస్తువు అవసరం వచ్చినా.. బ్యాగంతా సర్దేసి.. దుస్తులన్నీ బయటకు లాగేసి.. నానా హంగామా చేస్తుంటారు. బ్యాగులోని అరలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. వేటిని ఎక్కడ పెట్టామో గుర్తుంచుకోవాలి.