Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెదడు నిరంతరం స్పందించే గుణాన్ని కలిగి ఉంటుంది. కొన్నిసార్లు శరీరాన్ని, మనసును అదుపు తప్పకుండా కాపాడుతుంది. అది ఎలాంటి ఆలోచన అయినా మెదడులోనే పుడుతుంది. జీవితాన్ని సరిదిద్దుకోవాలన్నా, అంతం చేసుకోవాలన్నా అందుకు కావలసిన ఆలోచన మెదడులోనే పుడుతుంది. కానీ బలహీన మనస్తత్వం కలిగి ఉండి డిప్రెషన్‌కు గురైన వాళ్ల మెదడు తనను చుట్టుముట్టిన సమస్య గురించే ఆలోచిస్తుంది గానీ, ఆ పరిధి దాటి... సమస్యకు మూలం, దాన్ని తొలగించుకునే లౌక్యం మీదకు ఆలోచనలు వెళ్లవు. దాంతో సమస్య చుట్టూరానే ఆలోచనలు తిరుగుతూ డిప్రెషన్‌ను మరింత తీవ్రం చేస్తాయి. ఇలాంటి స్థితిలో ఆత్మహత్యలు చేసుకోవాలి అని అనిపించడం సహజమే! మెదడులోని ఆలోచనలు సానుకూలంగా ఉండాలన్నా, డిప్రెషన్‌కు, ఒత్తిడిని జయించాలన్నా.. కుటుంబం, స్నేహితుల సహకారం తప్పనిసరి. తీవ్రస్థాయిలో డిప్రెషన్‌కు గురవుతుంటే మాత్రం మానసిక నిపుణులను సంప్రదించడం మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.