Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైనవి. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగను అత్యంతవైభవంగా చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. ఇంటి నిండా క్యాండిల్స్ అలంక రించుకోవడం, క్రిస్మస్ ట్రీని తయారు చేయడం, బంధువులకు, స్నేహితులకు ఇవ్వాల్సిన బహుమతులను ఎంపిక చేయడం ఇలా ఎన్నో పనులతో బిజీగా మారుతారు. అయితే మనకు అందుబాటులో ఉండే ప్లాస్టిక్ పెట్ బాటిల్స్‌ను అందమైన అలంకరణ వస్తువులుగా మార్చుకోవచ్చు. కొద్ది సమయం కేటాయిస్తే వీటితో క్రిస్మస్ ట్రీ తయారుచేయడమే కాకుండా బహుమతులుగా కూడా ఇవ్వవచ్చు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్‌తో తోరణాల నుంచి కాంతులు వెదజల్లే లైటింగ్ వరకు ఎన్నో రకాల అలంకరణ వస్తువులను తయారుచేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం త్వరలో రానున్న క్రిస్మస్కు ఇప్పటి నుంచి ఇంటి అలంకరణ కోసం, బహుమతులు ఇవ్వడం కోసం
వీటిని తయారు చేద్దాం.