Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేయడానికి ఆరెంజ్ ఫేస్ ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది. చలికాలంలో ఎక్కువగా లభించే ఈ పండ్లు అనేకరకాల చర్మ సమస్యలను నివారిస్తాయి. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఆరెంజ్ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరెంజ్ ఫేస్‌ప్యాక్ కోసం అవసరమయ్యే పదార్ధాలు .. 1/2 కప్పు ఆరెంజ్ గుజ్జు, 2 టీస్పూన్స్ పెరుగు. ముందుగా ఒక గిన్నెలో నారింజ గుజ్జు తీసుకుని అందులో పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద ప్యాక్‌లా వేయండి. 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు ప్రకాశవంతంగా మార్చుతుంది. చర్మానికి సహజసిద్దమైన బ్లీచ్ వలె పనిచేస్తుంది. క్రమంగా చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా చేయడంతో పాటు మృతకణాలను తొలగించడంలో సహాయం చేస్తుంది. ఇందులోని సిట్రిక్ యాసిడ్ డీటాక్సిఫై లక్షణాలను కలిగి ఉండి ఆక్నే సమస్యలను నివారించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వృద్ధాప్య చాయలను తగ్గించడంలో సహాయపడుతుంది. టాన్ తొలగించి ముడతలను, కండ్ల చుట్టూ ఉండే నల్లని వలయాలను తొలగిస్తుంది. ఈ నారింజ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి వేసుకుంటే చలికాలంలో వచ్చే అన్ని రకాల చర్మసమస్యలను నివారించవచ్చు.