Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్ల పుట్టగానే ఆంక్షలు విధించే సంస్కృతి మనదేశంలో అనాదికాలం నుంచే ఉంది. అంతరిక్షంలో జైత్రయాత్ర చేసినా.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆడపిల్ల పెరిగే పరిస్థితి లేదు. ఒక యువతి తన అభిరుచి మేరకు జీవితాన్ని మలుచుకుంటే ఆమె జీవితం ఎలా ఉంటుంది అన్న ఇతివృత్తంతో వాస్తవికతకు ఫిక్షన్ జత చేసి 'స్మితీన్' నవల రూపంలో పాఠకులకు అందించారు పూజిత కృష్ణ. కేవలం రైటర్‌గానే కాకుండా నాట్యకళాకారిణిగా దేశవిదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నారు. డాన్స్ క్రిటిక్‌గా పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి మరుగున పడిపోయిన విలాసిని నృత్యకళపై విద్యార్థిగా పరిశోధన చేశారు. నాట్య, సంగీత, సాహిత్య రంగాల్లో రాణిస్తూ 'ఫీట్ ఆన్ ఎర్త్' డాన్స్ స్కూల్ ద్వారా ఒడిసి, కథక్, కూచిపూడి నాట్యాలను నేర్పిస్తున్నారు. సరికొత్త నృత్యరూపకాలకు కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ.. మరోవైపు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న ఆమె కళాప్రస్థానం ...
నాన్న చివుకుల గోపాలకృష్ణ, వింగ్ కమాండర్‌గా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేసేవారు. తాతయ్య హైకోర్టులో అడ్వకేట్. నాన్న ఉద్యోగం కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో నా చదువు సాగింది. దాదాపు 15ఏండ్ల పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తర్వాత నాన్న స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకోవడంతో హైదరాబాద్‌కు వచ్చాం. ఇక్కడ ఆర్మీ స్కూలులో ఇంటర్, భవన్స్ కాలేజీలో బి.కామ్ పూర్తి చేసాను. మా కుటుంబంలో సాహిత్య, సంగీత, నాట్య కళలు ముందు నుంచే ఉన్నాయి. జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణగారు, ప్రముఖ కవి దివాకర్ల వెంకట అవధాని గారు మాకు బంధువులు. అమ్మ అన్నపూర్ణకు సాహిత్యమంటే ఎంతో ఇష్టం. ఇతర రాష్ట్రాల్లో ఉన్నా.. తెలుగు పుస్తకాలు తెప్పించుకునేవారు. ఊరంతా తిరిగి మరీ పుస్తకాల షాపు, గ్రంథాలయం అడ్రసు తెలుసుకునేవారు. అలా చిన్నతనంలోనే అమ్మ కారణంగా సాహిత్యంపై మక్కువ పెరిగింది. స్కూలు స్థాయిలోనే చిన్నచిన్న కథలు రాసేదాన్ని. స్కూలులో డాన్స్ నేర్చుకున్నాను. ఇక హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ప్రముఖ నాట్యగురువు ఆనంద శంకర్ జయంత్ గారి వద్ద భరతనాట్యం నేర్చుకున్నాను. డిగ్రీ తర్వాత ఢిల్లీలోని శ్రీరామ్భారతి కళాకేంద్రంలో చేరాను. అక్కడ ఒడిసీ, కథక్ నేర్చుకోవాలనుకున్నాను. అయితే సరైన గురువులు లేకపోవడంతో ఆ నృత్యరీతులపై అంతగా ఆసక్తి కలగలేదు. న్యూఢిల్లీలోనే కొన్ని నృత్యకళాశాలలు చూసాను. పసుమర్తి విఠల్ గారు ఢిల్లీలో ప్రారంభించిన నృత్యకళాశాలలో కొద్దిరోజులు కూచిపూడి నేర్చుకున్నాను.
ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ ప్రముఖ గురువులు డాక్టర్ రమాదేవి, వేదాంత రామలింగశాస్త్రి గారి వద్ద కూచిపూడి నేర్చుకున్నాను. కూచిపూడి నేర్చుకుంటున్న సమయంలోనే టెంపుల్ డాన్స్ లాస్యం గురించి తెలిసింది. మరుగున పడిపోయిన ఆ నృత్యాం నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. ప్రముఖ నాట్యగురువు డాక్టర్ అనుపమకైలాస్ వద్ద చేరి టెంపుల్ డాన్స్‌లో ఒకటైన విలాసిని నృత్యం అభ్యసించే అవకాశం వచ్చింది. విలాసిని నాట్యం మరుగున పడిపోయిన టెంపుల్ డాన్స్. ఆలయాలలో దేవదాసీలు ఈ నృత్యం చేసేవారు. బ్రిటిష్‌కాలంలో వచ్చిన చట్టాల కారణంగా దేవదాసీ వ్యవస్థను నిషేధించారు. ఆ తర్వాత క్రమంగా ఈ నాట్యం ఆదరణ కోల్పోయింది.
2008లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ(డాన్స్) పూర్తి చేసాను. అదే సమయంలో పాశ్చాత్య నృత్యాలైన జాజ్ , ఫ్లేమెన్కోలో శిక్షణ తీసుకున్నారు. న త్యంలో ఎంఎఫ్ఎ పూర్తి చేయడమే కాకుండా, అక్కడే గెస్ట్ ఫ్యాకల్టీగా రెండేండ్లు కూచిపూడి బోధించాను. ఆ తర్వాత రివైవల్ ఆఫ్ విలాసిని డాన్స్ ఎట్ రంగనాథస్వామి టెంపుల్ అంశంపై రిసెర్చ్ చేసాను. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి స్టయిఫండ్ తీసుకుంటూ రిసెర్చ్ పూర్తి చేసాను. ఆ తర్వాత ఇంగ్లీష్ సాహిత్యం లో ఎం.ఏ(ఉస్మానియా యూనివర్సిటీ),ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ లో పిజీ డిప్లొమా పూర్తి చేసాను.
విలాసిని నృత్యకళాకారిణిగా..
కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ(డాన్స్) లో భాగంగా హైదరాబాద్‌లోని రంగనాథ స్వామి ఆలయంలో విలాసిని నాట్యం పునరుద్ధరణపై రాసిన థీసెస్ మిచిగాన్‌లో ఉన్న ప్రతిష్టాత్మక ప్రచురణకర్త సంస్థ ప్రోక్వెస్ట్ ద్వారా ప్రచురించబడింది. సంస్క తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జూనియర్ ఫెలోషిప్ అందుకున్నాను. విలాసిని నాట్యంలో ప్రదర్శనలు ఇవ్వడం హైదరాబాద్‌లోని రంగనాథ స్వామి దేవాలయపు వార్షిక బ్రహ్మౌత్సవాల సందర్భంగా 2006 లో ప్రారంభిచాను. అంతే కాదు అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై, డాన్స్ ఫెస్టివల్స్‌లో విలాసిని నాట్యాన్ని ప్రదర్శించాం. 2013 లో చెన్నైలో ప్రతిష్టాత్మక పార్థసారధి సభలో 112 వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కారం అందుకున్నారు. 2014 లో హైదరాబాద్‌లోని ధన్వంతరి ఫౌండేషన్ నుంచి ఉగాది పురస్కారం, 2016 లో ఐఐడిఎఫ్ అవార్డును అందుకున్నాను. దూరదర్శన్‌లో కూచిపూడి కళాకారిణిగా గుర్తింపు పొందడంతో పాటు అనేక సాంస్క తిక సంస్థల్లో భాగస్వామిగా ఉన్నాను.
ఫీట్ ఆన్ ఎర్త్..
డాన్స్ ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. లలితకళలు మనిషిలోని మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. నేను నేర్చుకున్న నృత్యకళల ను నేర్పించాలన్న ఆలోచనతో 2010లో ' ఫీట్ ఆన్ ఎర్త్' డాన్స్ స్కూల్‌ను ప్రారంభించాను. ఇక్కడ ఒడిసీ, కథక్, కూచిపూడి, పాశ్చాత్య నృత్య రీతులు నేర్పిస్తున్నాం. అంతేకాదు న్యూ రైటర్స్ ను ఎంకరేజ్ చేసేందుకు వర్క్‌షాపులను నిర్వహిస్తున్నాం. డ్యాన్స్‌పై పుస్తకాలు రాసే ప్రయత్నం చేస్తున్నాను.