Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది యువతీయువకులను వేధించే సమస్య మొటిమలు. ఈ సమస్యతో బాధపడేవారు మార్కెట్లో లభించే అనేక రకాల క్రీములను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల చర్మం కాంతిని కోల్పోతుంది. అలాకాకుండా క్రమం తప్పకుండా పాదహస్తాసనం సాధన చేస్తే మొటిమల సమస్య చాలావరకు తగ్గుతుంది.
పాదహస్తాసనం..
నిటారుగా నిలబడి పాదాలను దగ్గరగా ఉంచాలి. చేతులను, తలను పైకి ఎత్తి శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ శరీరాన్ని ముందుకు వంచి నుదుటితో మోకాళ్లను తాకాలి. అరచేతులను పాదాల ఇరువైపులా నేలపై ఉంచాలి. ఈ స్థితిలో అర నిమిషం పాటు ఉండి తిరిగి యధాస్థితికి రావాలి. ఐదా ఐదు సార్లు చేయాలి.
ఉపయోగాలు..
ఈ ఆసనం వల్ల ముఖంలో రక్తప్రసరణ బాగా జరిగి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
మొటిమల సమస్య తగ్గుతుంది.
చర్మం పై వచ్చే ముడతలు నివారించబడుతాయి.
జాగ్రత్తలు..
నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆసనాలు వేయవద్దు.
అధికరక్తపోటు, గుండె సమస్యలతో బాధపడేవారు ఈ ఆసనం వేయవద్దు.
గర్భణీలు ఈ ఆసనం వేయవద్దు.