Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు ఉద్యోగం కోసం దూరప్రయాణాలు చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. అయితే ఇలా ప్రయాణించడం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే ఆఫీసుకు దగ్గర్లోనే ఇల్లు మారాలని సూచిస్తున్నారు. ఉద్యోగానికి వెళ్లి రావడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల ఉద్యోగస్తులు తొందరగా అలసిపోతున్నారు. సుదీర్ఘ ప్రయాణాలతో ఉద్యోగస్తులకు జీవితంపై విరక్తి పుడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు లాంగ్ జర్నీ చేసే ఉద్యోగులు ఒత్తిడితో పాటు అనారోగ్యానికి లోనవుతున్నారు.
శారీరక, మానసిక ఒత్తిడులతో తమ పనులను ఉత్సాహంగా చేయలేరు. అంతేకాక సమయాభావ సమస్య కూడా వీళ్లు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఊబకాయం, రక్తపోటు, తొందరగా అలసిపోవడం, తరచూ అనారోగ్యం పాలై ఉద్యోగానికి సరిగా హాజరుకాలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారీ ట్రాఫిక్ సైతం వీరి బాధల్ని మరింత ఎక్కువ చేస్తోంది. వ్యాయామాలు చేయడానికి వీళ్లకి సమయమే ఉండట్లేదు. అసంతృప్తి ఏర్పడుతుంది. అందుచేత ఇలాంటి ఒత్తిళ్ళ నుంచి దూరం కావాలంటే అనుకూలమైన పనివేళలు ఉండటంతో పాటు లాంగ్ జర్నీతో కూడిన ఉద్యోగాలకు దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.