Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కమలాపళ్ళ తొక్కల్ని బాగా ఎండబెట్టి తర్వాత మెత్తగా చూర్ణం చేసి మనకు కావలసినప్పుడు కొద్దిగా తీసుకొని దానిని పెరుగులో కలిపి ఉంచితే అది పేస్టులా తయారవుతుంది. దానిని బాగా రంగరించిన తర్వాత ముఖానికి రాసుకుని గంట తర్వాత చన్నీళ్లతో కడిగితే ముఖవర్చసు పెరిగి మరింత ఆకర్షణీయంగా, తెల్లగా నిగనిగలాడుతుంది.
బాగా మరిగించిన నీళ్ళతో స్నానం చేయడం కన్నా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
తల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు బి కాంప్లెక్స్, ఐరన్ టాబ్లెట్స్, యాక్స్సాల్ క్యాప్సూల్స్ ప్రతిరోజూ ఒకటి చొప్పున వేసుకోవాలి.
తలకి స్నానం చేసేటపుడు ఒంటి సబ్బులు వాడకండి. గోరింటాకులో నిమ్మరసం, కోడిగుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రుపోవటమే కాదు జుట్టు పట్టులా మెత్తగా ఉంటుంది.
కొబ్బరి నూనె సువాసనగా ఉండాలంటే వట్టివేళ్ళుగాని, ఖర్జూరాలు గానీ వేసుకుంటే తాజాగా, మంచి సువాసనగా ఉంటుంది.
మందారపూలు ఎండబెట్టి కొబ్బరినూనెలో వేసి కాచి వడగట్టిన తర్వాత రాసుకుంటే తల వెంట్రుకల ఎదుగుదలకు, జుట్టు రాలకుండా ఉండేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.