Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంప్రదాయ వేడుకలకు పట్టుకి మించింది లేదు. అయితే ప్రతిసారీ వాటినే ఎంచుకోవాలనేం లేదు. పార్టీలు, అకేషన్లు ఏవైనా సరే.. కాస్త తేలిగ్గా ఉంటే సౌకర్యం, ఆధునికంగా కనిపిస్తే అందం. అందుకే రాబోయే వేడుకల్లో ఫ్యాన్సీ చీరలతో ఎలా మెరవచ్చో చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. చందేరీ, భాగల్పురీ, కాటన్ సిల్క్, టన్సర్, ఆర్గాంజా, శాటిన్ ఆర్గాంజా లినెన్, అసోం సిల్క్... ఇలా మనసు మెచ్చిన రకాన్ని ఎంచుకోవచ్చు. ఇవి చూడ్డానికి కాస్త సింపుల్గా, ఆకట్టుకునేలా కనిపిస్తాయి. అవసరం అనుకుంటే కాస్త హెవీ బ్లవుజుని జత చేసుకుంటే ఆడంబరంగానూ కనిపించొచ్చు. అలాంటి ఫ్యాన్సీ చీరలు మీ కోసం...