Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు నాయకత్వ లక్షణాలని మెరుగుపరుచు కోవాలంటే మొహమాటాన్ని దూరంగా పెట్టేయాలని మానసిక నిపుణులు అంటున్నారు. సాధారణంగా సమాజంలో చిన్నతనం నుండే ఆడపిల్లను పెంచే విధానంలో లింగవివక్ష వుంటుంది. ఇది గ్రామాల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అలా పెరిగిన మహిళలు ఉద్యోగాలు చేస్తూ కూడా తమ సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. చేసే పనిలో సందేహాలు వచ్చినా, ఏదైనా విషయాలు నలుగురిలో చెప్పాలంటే కాస్త బెరుకుగా మొహమాటపడుతుంటారు.
నేడు ఎంతో మంది మహిళలు ఇంటితో పాటు ఉద్యోగాలు చేస్తూ అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఐనా కాని కొంత మంది మహిళలు చిన్న సమస్య వచ్చినా, తాము తప్పు చేయకపోయినా ఎదుటివారికి సమాధానం చెప్పటానికి ఇబ్బంది పడుతుంటారు. అందుకే వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏదైనా ఇబ్బంది తలెత్తితే బేలగా తయారు కాకుండా సమర్థవంతంగా ఆ సమస్యను ఎదుర్కునేలా ముందే ప్లాన్ చేసుకోవాలి.
అలాగే వృత్తిపరంగా ముందడుగు వేయాలంటే బాగా రాణించే వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకు ముందుగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇందుకోసం పుస్తకాలు చదవండి. వ్యాయామాలు చేయండి. అవుట్ డోర్ గేమ్స్ ఆడటం అలవాటు చేసుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు.