Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాజు వస్తువుల మీద సన్నని గీతలు పడితే వాటి మీద టూత్పేస్టును వేసి రుద్దినట్లయితే నునుపుదేలుతాయి.
- అగరబత్తి నుంచి రాలినను వెండి, ఇత్తడి వస్తువులను రుద్దితే తళతళ మెరుస్తాయి.
- తెల్లటి షూ మీద ఏవైనా మరకలు పడి ఉతికినా పోకపోతే, దూదిని నెయిల్పాలిష్ రిమూవర్ లో ముంచి మరక మీద రుద్దాలి.
- షూ మీద పడిన మరకలు వదలకపోతే ఆఫ్టర్ షేవ్ లోషన్తో తుడిస్తే ఫలితం ఉంటుంది.
- షూ పాలిష్ గట్టిపడి వాడడానికి వీలుకాకుంటే ఐదారు చుక్కల వైట్ స్పిరిట్ వేస్తే మెత్తబడి పాలిష్ వేయడానికి అనువుగా మారుతుంది.
- లెదర్ షూస్ గట్టిపడి కాలికి వేసుకోవడానికి అసౌకర్యంగా ఉంటే రాత్రి పూట షూ లోపలి వైపు పెరుగు రాయాలి.
- మిక్సీలో మసాలాలు గ్రైండ్ చేసిన తర్వాత కడి గినా కూడా మసాలా వాసన వదలదు. అలాంటప్పుడు ఎండిపోయిన బ్రెడ్ ముక్కల ను వేసి ఒకసారి తిప్పితే చాలు.
- ఫ్లవర్ వాజ్లో నీళ్లు నిలవ ఉన్నా కూడా దుర్వాసన రాకుండా ఉండాలంటే ఆ నీటిలో చార్కోల్ ముక్కలు వేయాలి.
- బుక్షెల్ఫ్లో చిన్న చిన్న పురుగులు చేరుతుం టాయి. వాటినలాగే వదిలేస్తే పుస్తకాలను తినేస్తాయి. అరల్లో అక్కడక్కడా కర్పూరం బిళ్లలు వేస్తే పురుగులు పట్టవు.
- గ్లూస్టిక్ ఎండిపోయినట్లయితే అందులో కొద్దిగా గ్లిజరిన్ వేసి గోరువెచ్చగా చేయాలి. గ్లూ మెత్తబడి వాడుకోవడానికి వీలుగా మారుతుంది.