Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడిప్పుడే ఎండలు మొదలవుతున్నాయి. బోలెడంత ఖరీదు పెట్టి సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ఇష్టం లేకపోతే ఈ పనిచేయండి.
- బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకోవడం మరచిపోకండి. అందుకు దోస లేదా కీరదోస గుజ్జులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక కడిగేసుకుంటే సరి. ఎండకు కమిలిపోయినట్లున్న మీ ముఖం నిగనిగలాడుతుంది.
- కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలా మందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరి నూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి.