Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాలెంటైన్స్‌డే బహుమతులు అంటే... టీ, కాఫీ కప్పులు, టీషర్టులపై ఫొటోలను ప్రింట్ చేయించడమే చూశాం. కానీ చాక్లెట్ మీద కూడా ఫొటో ముద్రించుకోవచ్చు. ఈ అరుదైన చాక్లెట్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఈ సంవత్సరం ప్రేమికుల దినోత్సవం నాడు ఇచ్చే బహుమతులను పునర్నిర్వచించే విధంగా ఫాబెల్లే ఎక్స్‌క్విసైట్ చాక్లెట్స్ ఒక అరుదైన చాక్లెట్ రుచిని ప్రవేశపెట్టింది. అదే ఫాబెల్లే రూబీ జాండూయాబీ ఇండియాలో మొట్టమొదటి రూబీ చాక్లెట్. చాక్లెట్లంటే... తెలుపు, పాలు, నలుపు రకాలే అందుబాటులో ఉన్నాయి. కానీ ఫాబెల్లే తయారుచేసిన రూబీ చాక్లెట్ ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త నాలుగో రకం. అత్యంత విశిష్టమైన కోకోవా గింజల నుంచి తయారు చేసిన ఈ చాక్లెట్ కెంపు రంగులో ఉంటుంది. దీని రుచి కూడా అద్భుతమైనది. నెపోలియన్ కాలంనాటి ఇటాలియన్ రుచి. మీరెంతగానో ప్రేమించేవారికి మీరిచ్చే బహుమతి వైవిధ్యంగా, వ్యక్తిగతంగా ఉండాలనుకుంటే ఇది ఇచ్చి చూడండి! గిఫ్ట్బాక్సుపై మీరు ప్రేమించే వారి ఫొటో ముద్రితమై వస్తుంది. మీ ప్రేమను ఎంతో అందంగా వ్యక్తీకరిస్తూ ఇచ్చే బహుమతి కలకాలం మిగిలిపోయే జ్ఞాపకంగా ఉండిపోతుంది. www.itcstore.in/fabelle/valentinesday లోకి లాగాన్ అయి వారు కోరుకున్న ఫొటొతో ఒక బాక్స్ రూబీ జాండూయాను ఆర్డర్ చేయవచ్చు.