Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరంలో ఎలాంటి చెడు జరిగినా ఆ ప్రభావం వెంట్రుకల్లో ప్రతిబింబిస్తుంది. శరీరానికి సరిపడా పోషకాలు అందకపోయినా ఆ ప్రభావం వెంట్రుకల మీద పడుతుంది. ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో ఖర్చయిపోగా మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. ఒకవేళ సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్ ఇ, డి, సి, బి కాంప్లెక్స్ సక్రమంగా, సరిపడా అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి. అలాగే వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోవాలి. వాతావరణ మార్పుల ప్రభావానికి లోనవకుండా, కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి.