Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెనోపాజ్‌కు ముందు వెనుక ఉండే ఒక దశను 'పెరిమెనోపాజ్' అంటారు. మెనోపాజ్ రావడానికి కొన్ని ఏండ్ల ముందే మొదలయ్యే ఈ దశలో అండాశయంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. అండాల విడుదల ఆగిపోయి, ఈస్ట్రోజెన్ ఉత్పత్తి వేగంగా తగ్గిపోయే దాకా అంటే మెనోపాజ్ తర్వాత ఒకటి రెండేళ్ల దాకా ఈ పెరిమెనోపాజ్ కొనసాగుతుంది. ఈ దశలో బహిష్టులు క్రమం తప్పుతాయి. రుతుస్రావ పరిమాణం ఎక్కువగానో, తక్కువగానో కావడం, మామూలుగా కన్నా, ఎక్కువ రోజులు కావడమో, లేదా తక్కువ రోజులు కావడమో జరుగుతూ ఉంటుంది.
అలాగే ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల ఒక్కోసారి, రక్తనాళాల సంకోచ, వ్యాకో చాలు అస్థిరంగా మారి, హఠాత్తుగా, శరీరం పై భాగంలో, ఛాతీ నుంచి మెడలోకి, ముఖంలోకి, ఆ తర్వాత
శరీరం పై భాగమంతా వేడి ఆవిర్లు పాకుతాయి. ఆ వెంటనే చెమటలు పోసి చలి వేస్తుంది. అవి నాలుగు నిమిషాల దాకా ఉంటాయి. కొంత మందికి రోజుకు 2-3 సార్లు, మరికొందరికి గంటకు 3-4 సార్లు అలా రావచ్చు. కొందరికి అకస్మాత్తుగా రాత్రిపూట అలా వచ్చి నిద్రా బాగా పట్టకపోవచ్చు.
ఒత్తిళ్లను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కాఫీ, టీ, కారం, మసాలా, వేడిపదార్థాలకు దూరంగా ఉండాలి. తేలికగా, వదులుగా ఉండే దుస్తులను ధరించడం, బెడ్ రూమ్ వేడిగా ఉండకుండా చూసుకోవడం, శ్వాస వ్యాయామాల్ని చేయాలి. వేడి ఆవిరులు వస్తున్నాయని అనుమానం కలగగానే నిమిషానికి 6-8 సార్లు ఊపిరి తీసుకుని వదలాలి. ధ్యానం, సెల్ఫ్ హిప్నోసిస్ వంటివి కూడా చేస్తే మరింత ప్రయోజనకరం. రోజూ తప్పనిసరిగా నడక, ఈత, సైకిల్ తొక్కడం లాంటి వ్యాయామాలు చేయాలి. హార్మోన్ థెరపీ కూడా సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది.