Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం తీసుకునే ఆహారం, మందులు మనం వాడే కాస్మెటిక్స్ మధ్య చాలా సంబంధం ఉంటుంది. అందుకు ఈ కింది సందర్భాలే ఉదా హరణ. ఉబ్బసానికి వాడే మందు కొన్ని రకాల కాస్మెటిక్స్‌లో 'ఇథలీన్ డయామిన్' వంటి స్టెబిలైజర్స్ ఉంటాయి. ఈ కాస్మెటిక్స్ వాడి, అమి నోఫిలిన్ మందు తీసుకునే వారిలో తీవ్రమైన రియాక్షన్లు రావచ్చు. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. 'హెయిర్ డైలో' పారా ఫినిలిన్ డయా మిన్ ఉంటుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాల్లో వాడే రంగుల్లో కూడా ఇదే రంగు ఉంటుంది. ఆ హెయిర్ డై వేసుకున్న వాళ్ళు ఆ రకం ఆహార పదార్థాలు తింటే 'క్రాస్ సెన్సిటివిటీ' తో కూడా కొన్ని సార్లు అలర్జీలు వస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారం, కాస్మెటిక్స్, మందుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.