Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. ముక్కుదిబ్బడ, వాంతులు వంటి చిన్నచిన్నవి మన జోలికి రావు. క్యాన్సర్, మానసిక వైకల్యం వంటివి రాకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది ఈ పానీయం. అయితే ఈ టీ తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే ఈ టీని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు: 500 మిల్లీ లీటర్ల నీళ్ళు, స్పూన్ దాల్చిన చెక్క, సగం స్పూన్ అల్లం, 1/6వ వంతు పసుపు, చిటికెడు యాలకుల పొడి, సగం కప్పు పాలు, కొద్దిగా తేనె.
తయారీ విధానం:పైన పేర్కొన్న వాటన్నింటినీ నీటిలో కలిపి టీలా మరిగించుకొని వడపోసి తాగడమే. కావాలనుకుంటే దీనికి అదనంగా వేడిపాలు చేర్చుకోవచ్చు. రోజుకి ఒకటిరెండుసార్లు తాగితే సరిపోతుంది. తిండీ తిప్పలు మానేసి అదొక్కటే తాగరాదు. టీ తరహాలో తాగితే చాలు. పంచదార మాత్రం ఇందులో వెయ్యకూడదు.