Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిక్సీ వంటింటికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే దానిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనితో పచ్చళ్ళు, కారప్పొడులు, మసాలాలు నిమిషాల్లో రెడీ చేసుకుంటాం. దాంతో వంట కూడా త్వరగా చేసుకోవచ్చు. ఈ వంటింటి సాధనాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మిక్సీ ఎలాంటి సమస్యలు రాకుండా పనిచేయాలంటే దాని గురించి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేంటో తెలుసుకుందా.
- మిక్సీ పట్టే ముందు జార్లో బ్లేడు టైట్‌గా ఉండాలి. అలా చూసుకోకుండా మిక్సీ వేస్తే బ్లేడు విరిగిపోయే అవకాశం ఉంటుంది.
- మిక్సీ జార్ల్ వేడి వేడి పదార్థాలు వేయకూడదు. అలావేస్తే మోటార్ త్వరగా వేడెక్కి పాడైపోతుంది.
- మిక్సీని హైస్పీడ్‌లో వేయకూడదు. లోస్పీడ్‌లో వేసుకోవాలి. లోస్సీడ్లోనే ఆఫ్ చేయాలి.
- జార్లో సగం కంటే ఎక్కువ పదార్థాలను వేయకూడదు. అతిగా నింపడం వల్ల త్వరగా పాడవుతుంది.
-మిక్సీ వాడిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి.
- జార్‌ను, మిక్సీను వాడిన వెంటనే శుభ్రం చేయడం మరవకండి. అలా చేయకుంటే జార్లోని బ్లేడ్లు గట్టిపడి చెడిపోయే అవకాశం ఉంది.
- జార్‌ను కడిన వెంటనే గుడ్డతో తుడవాలి.
- నీరుపోసిన మినప్పుప్పు ఫ్రిజ్‌లో నుండి బయటకు తీసి మిక్సీలో గ్రైండ్ చేస్తే పిండి బాగా పొంగుతుంది.
- మిక్సీ జార్లు గట్టిపడినప్పుడు ముందు నీళ్ళు పోసి తిప్పాలి. అప్పుడు బ్లేడ్లు లూజౌతాయి.
- మిక్సీని ప్రతి రోజూ కాకుండా 15 రోజులకొకసారి వాడితే మంచిది.
- ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ మిక్సీ ఎక్కుకావలం చక్కగా పనిచేస్తుంది.