Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖంపై నలుపు ఏర్పడటానికి వాతావరణ కాలుష్యం ప్రధాన కారణం. అలాంటప్పుడు ఒక తాజా టొమాటో మధ్యలోకి కోసి ఆ ముక్కని పంచదారలో అద్దాలి. దానిపై కొద్దిగా చిక్కని పెరుగు వేసి ముఖంపై రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే ముఖంపై పేరుకున్న నలుపుదనం నెమ్మదిగా పోతుంది.
- ఒక ముక్క టొమాటో రసం, ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా పెరుగూ కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. మరీ పల్చగా ఉందనుకుంటే సెనగపిండి కానీ, ముల్తానిమట్టి కానీ కలిపి చిక్కగా చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే నలుపు తొలగిపోతుంది. చర్మం తాజాగా మారుతుంది. మొటిమల సమస్యా కూడా తగ్గుతుంది.
- ఒక ముక్క టొమాటో రసానికి చెంచా కొత్తిమీర రసం జోడించాలి. ప్యాక్ రాసుకోవాలంటే చిక్కగా ఉండాలి కాబట్టి అవసరం మేరకు కొద్దిగా ముల్తానీ మట్టి కలుపుకోవాలి. దీన్ని ముఖానికీ, మెడకీ పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది.