Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీట్రూట్... చాలా మంది తినడానికి ఇష్టపడరు. కానీ కూరలా తిన్నా, జ్యూస్ చేసుకుని తాగినా... అది చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రత్యేకంగా రోజూ గ్లాసు బీట్రూట్ జ్యూస్తాగితే.. చాలా మంచిది!
- రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగుతూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు కావాల్సిన రక్తం సరఫరా అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఏకాగ్రత పెంచుతుంది.
- రోజూ బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఉండే చెడుకొవ్వు మొత్తం కరిగిపోతుంది. అధిక కొవ్వుతో ఇబ్బందిపడేవారు బీట్రూట్ జ్యూస్ తాగుతూ ఉంటే మంచిది.
- బీట్రూట్ గర్భిణులకు చాలా మంచిది. ఫోలిక్ యాసిడ్ దీని ద్వారా అందుతుంది. పిండం సక్రమంగా ఎదగాలంటే రోజూ బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిది.
- కాలేయాన్ని శుద్ధి చేయడానికి బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావు. ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్రూట్కు ఉంటుంది.
- ఐరన్ తక్కువగా ఉంటే రక్తహీనతకు గురవుతారు. బీట్ రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుతుంది. అలాగే బ్లడ్ లో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది.
- చాలా మంది నీరసంతో ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారు కొన్ని బీట్ రూమ్ ముక్కలు తిన్నా లేదంటే బీట్రూట్ జ్యూస్ తాగినా సరిపోతుంది. దీంతో నీరసం పోయి శక్తి వస్తుంది.
- బీట్రూట్లో బాడీకి కావాల్సిన చాలా విటమిన్స్ ఉంటాయి. బీపీ నియంత్రణలో ఉండేందుకు బీట్ రూట్ బాగా దోహదం చేస్తుంది. బీట్రూట్లో కాల్షియంతో పాటు మెగ్నిషియం కూడా బాగానే ఉంటుంది. అలాగే పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇవన్నీ ప్రతి మనిషికి చాలా అవసరం.
- తరచూ బీట్రూట్ తీసుకుంటే గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటాం. బీట్ రూట్ జ్యూస్ తాగినా సరే గుండె సంబంధిత వ్యాధులు రావు.