Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉరుకుల పరుగుల జీవితాలు. అందం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి చాలా మందికి తీరదు. కానీ మీరు ఎంత బిజీగా ఉన్నా సరే కచ్చితంగా కాస్త మీ చర్మ సంరక్షణపై కొంత దృష్టి పెట్టండి.
- రాత్రి పడుకునే ముందు కచ్చితంగా ముఖం కడగండి. పొద్దంతా పడిన దుమ్ముదూళి రాత్రంతా ఉంటే.. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. చర్మానికి గాలి అందదు.
- ఉదయం లేవగానే మీరు చేయాల్సిన మొదటి పని.. మీ ముఖానికి ఆవిరిపట్టడం. దీంతో చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. కాంతివంతంగా మారుతుంది.
- ఉదయం లేచిన తర్వాత కొద్ది సేపటికి ముఖాన్ని కచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రాత్రంతా ముఖంపై పేరుకుపోయిన జిడ్డు పోతుంది. అలాగే బ్యాక్టీరియా మొత్తం కూడా పోతుంది. ముఖానికి కావాల్సిన రక్తప్రసరణ అందుతుంది.
- చాలామంది ఉదయాన్నే టోనర్ ఉపయోగించరు. అయితే కచ్చితంగా టోనర్ ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. ఇలా చేస్తే పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది. టోనర్స్లో రసాయనాలు లేకుండా చూసుకోండి. టోనర్ పూసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మాయిశ్చరైజేషన్కు మంచి క్రీమ్ ఉపయోగించండి. సూర్యుని ప్రభావం చర్మంపై పడకుండా ఉండేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం జిడ్డుగా మారకుండా ఉంటుంది.
- ఉదయం తీసుకునే అల్పాహారం మీ చర్మ సౌందర్యంపై ప్రభావం చూపుతుంది. రోజూ బెర్రీలు తినడం అలవాటు చేసుకోండి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు తినాలి. దీంతో మీ బాడీకి కావాల్సిన విటమిన్లు అందుతాయి. దాంతో మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. చర్మం సున్నితంగా మారుతుంది. రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం మంచిది.