Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాజిటివ్ థింకింగ్‌తో సమస్యలు దూరం అవ్వడంతో పాటు.. విజయాలూ సొంతం అవుతాయని చాలామందికి తెలిసిందే. కానీ విషయాలను పాజిటివ్‌గా తీసుకోవడమెలాగో తెలియక తికమకపడుతుంటారు. మీలో పాజిటివ్నెస్ పెరగాలంటే ఇలా చేసి చూడండి.
మనకున్న స్నేహితుల్లో కొందరు ఎప్పుడూ ప్రతికూలంగానే మాట్లాడు తుంటారు. ఇంకొందరు ఎప్పుడూ ఇతరుల్లో లోపాలను మాత్రమే వెతుకుతుంటారు. అలాంటి వారికి కాస్త దూరంగా ఉంచండి. సస్సాంగత్యం మనలో మంచి మార్పునకు నాంది పలుకుతుంది. అలాంటి వారితో స్నేహం చేయండి. దీనివల్ల మీ ఆలోచనా విధానం కూడా మారుతుంది. మన చుట్టూ ఉండే వాతావరణం కూడా మనసుపై ప్రభావం చూపుతంది. తరచూ ప్రక తిని ఆస్వాదించండి. అది మీలో ఆత్మవిశ్వాసంతో పాటు పాజిటివ్నెస్నూ పెంచుతుంది. ప్రకతితో గడిపే తీరికెక్కడిదీ అంటారా..? అయితే మీ దైనందిన జీవితంలో రోజుకు ఒకట్రెండుసార్లు ఓ పది నిమిషాల పాటు ప్రశాంతంగా ఆలోచించండి. ఏం చేస్తున్నాం.. ఏం చేయాలి..?అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎలా వ్యవహరించాలో మీకు మీరే నిర్ణయం తీసుకోండి. ఇది అలవాటుగా మారితే మంచి మార్పును ఆహ్వానించినట్టే. ఉదయాన్నే శ్రావ్యమైన సంగీతం వినండి. ఆ పాటకు మీరూ శ్రుతి కలపండి. దీని వల్ల మీకు ఎక్కడలేని ప్రశాంతత వస్తుంది. స్ఫూర్తినిచ్చే కొటేషన్లు, మంచి పుస్తకాలు చదవండి. ఇవన్నీ మీలోని పాజిటివ్ పవర్‌ను ద్విగుణీక తం చేస్తాయి. ఇష్టమైన పనులు చేసినపుడు మనసు ఆనందంగా ఉంటుంది. మీకు ఇష్టమైనవి ఏవో తెలుసుకోండి. వారాంతాల్లో అలాంటి వ్యాపకాల్లో నిమగమవ్వండి. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోండి. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నపుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పోషకాలు సమద్ధిగా ఉండే ఆహారం తీసుకోండి. ఈ టిప్స్ ఫాలో అయిపోతే మీలో పాజిటివ్నెస్ పెరిగి పదుగురు మెచ్చే మార్పు వచ్చేస్తుంది.