Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాపిల్ సిడార్ వెనిగర్ గురించి వినే ఉంటారు. ఇది బహుళ ప్రయోజన కారి. ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మేని అందాన్ని కూడా రక్షిస్తుంది. అంతేకాదు వంటల్లో సైతం దీన్ని ఉపయోగించొచ్చు.
- యాపిల్ సిడార్ వెనిగర్ జీర్ణక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. కడుపులో గాలి నిండిపోయి బాధపడుతుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఎంజైములు పుష్కలంగా ఉండే యాపిల్ సిడార్ వెనిగర్‌ని నీటిలో లేదా టీలో ఒక స్పూన్ కలిపి అన్నం తినే ముందర తీసుకోవాలి. ఎసివి వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. గుండెల్లో మంటగా అనిపించినప్పుడు కూడా దీన్ని వాడొచ్చు. వెనిగర్ టేస్టు నచ్చకపోతే అందులో కొద్దిగా తేనె వేసుకుని తీసుకోవచ్చు.
- దీన్ని సలాడ్స్తోబాటు రకరకాల వంటకాల్లోనూ వాడుతుంటారు. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల నివారణకూ ఇది సంజీవనీలా పనిచేస్తుంది. యాంటి వైరల్, యాంటి ఫంగల్‌గా కూడా పనిచేస్తుంది. గొంతు సమస్యలను, గుండెలో మంట లాంటి బాధలను తగ్గిస్తుంది. అయితే దీనిని వైద్యుల సలహామేరకే వాడాలి.
- ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడమే కాదు శిరోజాలను పట్టులా ఉంచుతుంది. ఇది ప్రకతి సిద్ధమైనది కాబట్టి చర్మంపైగాని, శరీరంపైగాని ఎలాంటి దుష్ప్రభావం చూపదు. దీని ఖరీదు కూడా తక్కువే. దీని వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
- దీన్ని వాడడం వల్ల దంతాలు మిల మిలా మెరుస్తాయి. దంతాలపై ఉన్న మచ్చలు పోవాలంటే యాపిల్ సిడార్ వెనిగర్‌తో పళ్లను తోమి నీళ్లతో బాగా పుక్కిలించాలి. దంతాలు మెరవాలని తరచూ మాత్రం ఇలా చేయొద్దు. అలా చేస్తే దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. మౌత్‌వాష్‌గా కూడా వాడొచ్చు. ఒక కప్పు నీళ్లల్లో ఒక టీస్పూన్ యాపిల్ సిడార్ని వేసి ఆ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి.
- ఏసివితో తలలో చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టును షాంపుతో రుద్దుకున్నతర్వాత ఒక స్ప్రే బాటిల్లో నీటిని, యాపిల్ సిడార్ వెనిగర్‌ని(1/4 కప్పు) సమపాళ్లల్లో కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుపై స్ప్రే చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత జుట్టును నీటితో బాగా కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. వెనిగర్‌లో ఉన్న ఎసిడిటీ చుండ్రుకు కారణమైన ఫంగస్‌ను నివారిస్తుంది.
- ఇదిగొంతునొప్పిని కూడా తగ్గిస్తుంది. గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లల్లో ఒక స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్, పెప్పర్ ఒక టీస్పూను, మూడు టీస్పూన్లు క్లోవర్ హనీలను వేసి బాగా కలిపి తీసుకుంటే మంచిది. అలర్జీల కారణంగా వచ్చే గొంతు ఇన్ఫెక్షన్లపై కూడా యాపిల్ సిడార్ వెనిగర్ బాగా పనిచేస్తుంది.
- చెమట వల్ల వచ్చే దుర్వాసనను కూడా పోగొట్టవచ్చు. చర్మం మీద కూడా ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. యాపిల్ సిడార్ వెనిగర్‌లో కాస్త నీటిని పోసి పలచగా చేసి అందులో తెల్లటి బట్టను తడిపి దానితో ముఖం తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో ఉన్న అదనపు ఆయిల్ బయటకు వచ్చేయడమే కాకుండా చర్మం ఎంతో మదువుగా తయారవుతుంది.
- చిరుతిళ్లు తినే అలవాటును కూడా ఇది తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. వెనిగర్‌లోని ఉండే ఎసిటిక్ యాసిడ్ వల్ల ఆకలి వేయదు. శరీరంలో ఆహారానికి సంబంధించిన గ్లైసెమిక్ ఇండెక్స్‌ను ఇది నియంత్రిస్తుంది. ఫలితంగా షుగర్ తక్కువ పరిమాణంలో రక్తంలో విడుదలవుతుంది. దీంతో ఆకలి తగ్గుతుంది.