Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తృణధాన్యాల్లో కొర్రలకు ఒకింత ప్రత్యేకత ఉంది. మధుమేహాన్ని నియంత్రించటంలో కొర్రలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇంతకు ముందు తరాలు ఎక్కువగా డయాబెటిస్ బారిన పడలేదంటే అదంతా ఈ కొర్రల చలవే.
- కొర్రన్నం తినటానికి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు మామూలు బియ్యంలో గుప్పెడు కొర్రల్ని వేసి అన్నం చేసుకుని తింటే మంచి గుణం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.
- కొర్రల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో సులువుగా జీర్ణమైపోతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి కూడా.
- కొర్రల్లో ప్రొటీన్లు 11 శాతం ఉంటాయి. ముఖ్యంగా కొర్రలతో చేసిన ఆహారం తింటే కొవ్వు పెరిగే సమస్యే ఉండదు.
- శరీరంలోని జీవక్రియల్ని సక్రమంగా నడిపించే శక్తి ఈ తృణ ధాన్యాలకుంది. మారుతున్న జీవన శైలిలో.. ఆరోగ్యంగా ఉండాలంటే డైట్లో కొర్రలు చేర్చుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.