Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో పండ్లు, కూరగాయల రసాలు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా, నిత్యం యాక్టివ్‌గా ఉంచేందుకు జ్యూస్‌లు బాగా ఉపయోగపడతాయి. అయితే పండ్ల రసాలే కాకుండా కూరగాయలతో చేసుకునే జ్యూసులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. వాటి గురించి తెలుసుకుందాం...
- కొన్ని కూరగాయలను వండకుండానే జ్యూస్ చేసుకుని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. క్యారెట్ జ్యూస్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను బయటకు పంపుతుంది. అలాగే చర్మాన్ని సంరక్షిస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
- కీరదోస జ్యూస్‌ను రోజూ తాగితే అధిక బరువు తగ్గుతారు. కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. కీళ్ల వ్యాధులు ఉన్నవారు రోజూ కీరదోస జ్యూస్ తాగడం మంచిది.
- ప్రతిరోజూ పరగడుపున ఒక గ్లాస్ టమోటా జ్యుస్ త్రాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫైటో న్యూట్రియంట్లు శరీరంలో కణజాలం నశించకుండా కాపాడతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా కూడా కాపాడతాయి. టమోటాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచి మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో సమ ద్ధిగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్తం గడ్డకట్టకుండా చేస్తూ గుండె జబ్బులను నివారిస్తాయి. టమోటాలో సమ ద్ధిగా ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్లు రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సిలు కంటి సమస్యలకు చెక్ పెడతాయి. స్పష్టమైన చూపు నివ్వడంతో పాటు శుక్లాలు రాకుండా నివారిస్తుంది.
- రోజూ బీట్రూట్ జ్యూస్‌ను తాగితే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రక్తం బాగా తయారవుతుంది. శరీరకణాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీట్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అదే విధంగా బీట్రూట్ జ్యూస్‌లో లైకోపిన్ రక్త పోటును నివారిస్తుంది.