Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు బలంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఐరన్ తప్పని సరి అంటున్నారు నిపుణులు. కానీ ఇటీవలి కాలంలో మహిళల్లో ఐరన్ లోపం ప్రధానంగా కనబడుతోంది. దీనివల్ల శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఐరన్ లోపాన్ని గుర్తించడమెలా? నివారించాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలి?
ఐరన్ లోపం గుర్తించడమెలా?
- ఐరన్ లోపం వల్ల తీవ్ర అలసట ఉంటుంది. చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోతారు. అలసటతో పాటు చికాకు, బలహీనంగా మారడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- రోజువారీ పనులు చేస్తున్నా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుం టుంది. మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉంటుంది. ఐరన్‌లోపం ఉన్నవారిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అన్ని విషయాలకూ తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు.
-8 నిద్రలో కాళ్లు అదేపనిగా కదుపుతుం డడం, మధ్యమధ్యలో గోకుతుండడం ఐరన్ లోపానికి సంకేతంగా చెప్పవచ్చు. జుట్టు ఊడిపోతుంది. చిన్నపిల్లలు చాక్ పీస్, మట్టి, కాగితాలు వంటివి తింటుంటే ఐరన్‌లోపం ఉన్నట్లు గుర్తించాలి.
- ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. దానివల్ల హైపోథారాయి డిజమ్ అనే సమస్య తలెత్తవచ్చు. త్వరగా అలసిపోతుండడం, బరువు పెరుగుతుం డడం, శరీరం చల్లగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం పాలిపోతుంది. పెదవుల లోపలి భాగంలో, చిగుళ్లు, కనురెప్పల లోపల కూడా ఎరుపుదనం తగ్గుతుంది.
ఐరన్ లభించాలంటే...
- ఐరన్ లోపం తలెత్తకుండా మన ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మరీ సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుని సలహాతో మందులు వాడవచ్చు. అయితే పలు రకాల ఆహార పదార్థాల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అవేమిటంటే... పప్పుధాన్యాలు, పాలకూర, గింజపప్పులు, చికెన్, కాబూలీ శనగల్లో ఇతర పోషకాలతో పాటు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. దీంతోపాటు జీలకర్ర, కొత్తిమీర, పసుపు, ఎర్ర మిరపకాయలు, బీట్ రూట్, టమాటలు, యాపిల్స్, చెర్రీలు వంటి ఎరుపు దనం ఉన్న పండ్లు, ఆహార పదార్థాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వాటిని తరచూ తింటుంటే ఐరన్ లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.
- నారింజ, ద్రాక్ష, చెర్రీ, మామిడి, పైనాపిల్ లో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. విటమిన్ 'సి' ముఖ్యంగా ఐరన్‌ను శరీరానికి అందించడం లో కీలక పాత్ర పోషిస్తాయి. దాంతో పాటు పొద్దుతిరుగుడు గింజలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు ఇలా మొదలైన వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఐరన్ అత్యధికంగా లభించే ఆకుకూరలు తిన్నా సరిపోతుంది.