Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రకం పప్పులైనా కొన్ని రోజులకే పురుగుపడుతుంటుంది. దాన్ని శుభ్రం చేయడానికి జల్లించడం, ఎండలో ఆరబెట్టడం వంటివి చేస్తుంటాం. అయితే నిల్వ ఉంచే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా రోజుల వరకు వాటికి పురుగు పట్టకుండా చూసుకోవచ్చు.
- పప్పుల్ని నిల్వ చేసే డబ్బాలో కొంచెం పసుపు చల్లితే ఎటువంటి పురుగూ పట్టదు. కొన్నిసార్లు చీమలు కూడా పడుతుంటాయి. అలాంటప్పుడు డబ్బాలో కొన్ని లవంగాలు వేయడం ద్వారా చీమలు పట్టకుండా చేయవచ్చు.
- షాపు నుంచి తెచ్చిన వెంటనే పప్పులను డబ్బాలో పోయకుండా కనీసం ఆరు గంటలసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆ తరువాత కడాయిలో నూనె వేయకుండా తక్కువ మంటతో వేగించాలి. వేడి తగ్గిన తరువాత వాటిని గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే పప్పులని చాలా రోజులు పురుగుపట్టకుండా జాగ్రత్తపరచుకోవచ్చు.
- పప్పు నిల్వ చేసేటప్పుడు డబ్బాలో కొంచెం ఇంగువ వేస్తే చాలా రోజుల వరకు పురుగు పట్టదు.
- పప్పులకి కొద్దిగా ఆముదం నూనె రాసి గాలి దూరని డబ్బాలో నిల్వా చేయాలి. ఇలా చేస్తే పురుగుల బెడద తప్పుతుంది.
- పప్పు నిల్వ చేసే డబ్బాల్లో వేపాకు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేయడం ద్వారా కూడా పురుగు పట్టకుండా జాగ్రత్త పడొచ్చు.