Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరి చర్మం ఎప్పుడూ జిడ్డుగా ఉండి ఇబ్బంది పెడు తుంటుంది. వేసవిలో ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే ఈ కింద చెప్పిన టిప్స్ పాటించి చూడండి. మీ ఫేస్ ఫ్రెష్‌గా ఉండటమే కాదు.. ఎంతో మదువుగా, అకర్షణీయంగా, చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది.
- ముఖం మీద ఉన్న జిడ్డుదనాన్ని పోగొట్టడంలో ఐస్ బాగా పనిచేస్తుంది. ముఖానికి మేకప్ వేసుకునే ముందు చల్లటినీళ్లతో ముఖం కడుక్కోవాలి. లేదా ఐస్ ముక్కతో ముఖాన్ని రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పైభాగంలో ఉండే సూక్ష్మమైన రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో చర్మంలోకి నూనె వెళ్లే అవకాశం ఉండదు. చర్మ రంధ్రాలు మూసుకుని పోవడం వల్ల చర్మం జిడ్డుగా తయారయ్యే అవకాశం ఉండదు.
- క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ కాకుండా వాటర్‌ప్రూఫ్ ప్రొడక్ట్స్ వాడితే చర్మం జిడ్డుకారదు. ఎందుకంటే వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తులు చర్మంలోకి ఇంకిపోవడం వల్ల జిడ్డుతనం ఉండదు.
- పఫ్తోనే ఫేస్ పౌడర్ని ముఖానికి వేసుకోవాలి.
- జిడ్డు చర్మంతో బాధపడేవారు వెట్ టిష్యూ పేపర్ని ఎప్పుడూ తమ దగ్గర పెట్టుకుంటే మంచిది. అవసరమైనప్పుడల్లా ముఖాన్ని దానితో శుభ్రంగా తుడుచుకోవచ్చు.
- చర్మం జిడ్డుగా ఉండకుండా ఎప్పుడూ మెరవాలంటే నీరు బాగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలన్నీ బయటకుపోతాయి. అలాగే రోజూ ప్రొటీన్ ఫుడ్‌ని సమపాళ్లల్లో తినాలి. అంతేకాదు తేనె, ఆలివ్ నూనె, పసుపు, శాండల్వుడ్లను కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని కాసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకుంటే చర్మం మెరుస్తుంది. ఎంతో మదువుగా కూడా తయారవుతుంది.
- వీటితోపాటు ప్రతి రోజూ రెండు టీస్పూన్ల కలబంద జ్యూసుతో పాటుగా రెండు టీస్పూన్ల ఉసిరి పొడి కలిపిన జ్యూసును కూడా తాగితే చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. బాగా మెరుస్తుంది. నూనెతో శరీరాన్ని తరచూ మసాజ్ చేయించుకుంటే కూడా చర్మం ఎంతో మదువుగా తయారవుతుంది. రిఫైన్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అలాగే ఎక్కువసార్లు టీ, కాఫీలు, కూల్ డ్రింకులు తాగడం వల్ల చర్మ సౌందర్యం బాగా దెబ్బతింటుంది. వయసు కూడా ఎక్కువగా కనిపిస్తుంది.