Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని ఆరోగ్య సమస్యలకు మూలం సరియైన డైట్ తీసుకోకపోవడమే అంటున్నారు నిపుణులు. డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యం దరిచేరదని వారు సూచిస్తున్నారు. మీరు డైట్ రూల్స్ పాటించకుంటే ఈ రోజు నుంచే మారిపోండి. ఈ సూచనలు ఫాలో అయిపోండి.
ఫైబర్ అధికంగా లభించే ఆహారం తీసుకోండి. పొట్ట నిండిన ఫీలింగ్ రావడానికి, జీర్ణక్రియ బాగా జరగడానికి ఫైబర్ ఉపయోగపడుతుంది. తాజా పండ్లు, నట్స్, ఆకుకూరలు ఎక్కువగా తినండి. మసాలాలు, వేయించిన పదార్థాలు, వెన్నతో చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. భోజనం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఎందుకంటే సమయానికి భోజనం చేయకపోతే శరీరం కొవ్వును నిలువ చేసుకుంటుంది. అంతేకాకుండా సమయం తప్పిన తరువాత చేసే మీల్ను అధికంగా తీసుకుంటారు. ఇది కూడా ముప్పే. ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగండి. టాక్సిన్స్ బయటకు పంపడానికి ఇది ఉపయోగపడుతుంది.