Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగాలకు వెళ్లే మహిళలకి తయారవడానికి ఎక్కువ సమయం ఉండదు. అదీకాక కాలుష్యం వల్ల మొటిమలు, మచ్చలు. వీటినుంచి బయటపడాలంటే ఇలా చేయండి....
- ముఖంపై సన్నటి వెంట్రుకలు కనబడుతుంటే చెంపలకు ఫౌండేషన్ పౌడర్ని కాస్త ఎక్కువగా రాసుకోవాలి. నిమ్మరసాన్ని చెంపలపై రాసు కొని బాగా రుద్దాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే వెంట్రుకలు పలుచబడతాయి.
- మొటిమలతో ఇబ్బంది పడేవాళ్లు ఫౌండేషన్ వేసుకోక పోవడమే మంచిది. దానికి బదులుగా ముఖానికి ఏదైనా ఫ్రూట్ ప్యాక్ వేసుకోవాలి. ఇలా రెండురోజులకొకసారి చేస్తే మొటిమలు తగ్గిపోతాయి కూడా.
- ఇంట్లో పనులు చేసుకోవడం వల్ల నెయిల్ పాలిష్ త్వరగాపోతుంది. నెయిల్ పాలిష్ వేసుకున్నాక పాలమీగడతో గోళ్లను మర్దనా చేస్తే పాలిష్ చాలా రోజులు ఉంటుంది.
- మోచేతులు పొడిబారిపోయి ఉంటే మూడు రోజుల కొకసారి ఆలివ్ ఆయిల్‌తో మర్దనా చేస్తే మదువుగా మారతాయి.
- హెయిర్ కలర్ త్వరగా పోతుంటే బ్లాక్ టీతో తలం టుకోవాలి. ఇలా చేస్తే జుట్టుకి రంగు తిరిగొస్తుంది.