Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్లలపై ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా లేకపోతే ఆకతాయిలు ఆగడాలకు పాల్పడుతారు. ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలి. అల్లరి చేయాలని చూసేవారికి తగిన బుద్ధి చెప్పాలి. అతని చేతిని లాక్ చేయాలి. దాంతో అతను తప్పించుకుపోలేడు.
రోడ్ పైన నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయి వెనుకనుంచి జుట్టుని లాగుతూ ఆకతాయిలూ టీజ్ చేస్తుంటారు. అలా వెనక నుండి జుట్టుని లాగినపుడు భయపడకుండా ఎదిరించాలి.
వెంటనే కుడి కాలితో అతని కాళ్లను లాక్ చేయాలి. అప్పుడు అతనికి బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోతాడు.
అతని చిన్ పైన మన అరచేతితో బలంగా కొట్టాలి. ప్రతిదాడిని అతను ఊహించలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు. మనం అక్కడి నుండి వెళ్లిపోవాలి. దగ్గరల్లో పోలీసులు ఉంటే వారికి సమాచారం అందించాలి.