Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టున్నమ్మ ఏ కొప్పైనా వేస్తుంది. కానీ చిన్న జుట్టయినా పోనీ వేసి కొప్పు వేయడం చాలా సులువు. అంతేకాదు... పెద్ద జుట్టులా అందమైన కొప్పు వస్తుంది. అందుకు పెద్ద రబ్బర్బ్యాండ్, పక్క పిన్నులు ఉంటే సరిపోతుంది. ముందుగా జుట్టును పోనీ వేయాలి. పోనీలోంచి తీసిన జుట్టును కాస్త గుబురుగా చేసి.. లోపలికి మడిచి ఫొటోలో చూపిన విధంగా పిన్ పెట్టాలి. చుట్టూరా అట్లాగే మడిస్తే సరి.. అందమైన కొప్పు రెడీ!