Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదో జరుగుతుందని భయపడి చేయకుండా ఉండొద్దు. ఏం చేయకుండా ఇంట్లో ఉన్నా హార్ట్ అటాక్ రావచ్చు. వయసు సంఖ్య మాత్రమే. మీకు కావాల్సిందల్లా...చేయాలన్న కమిట్మెంట్ మాత్రమే. ఏదైనా చేయాలనుకుంటే.. భర్త సహకారం కావాలను కుంటారు చాలా మంది. కానీ... నాకు సహకారం అవసరం లేదు. నేనుచేసేదానిపట్ల గౌరవం ఉంటే చాలు. నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు.. వద్దని చెబితే.. ఎందుకు అని అడుగుతాను. సేఫ్ కాదు అంటే.. నేనేం భద్రతా చర్యలు తీసుకుంటున్నానో వివరిస్తాను. అంత కాన్ఫిడెన్స్ ఇస్తాను. ఒకప్పుడు ఆలోచించేవాళ్లు. ఇప్పుడు ఆయన గర్వపడుతున్నారు. మహిళలు ఏది చేయాలన్నా.. మొదట భయపె డతారు. దాంతో ఆత్మ విశ్వాసం పోతుంది. ఏదో తప్పు చేసినట్టు ఫీలయ్యేలా చేస్తారు. ఆ తరువాత పశ్చాత్తాప పడేలా చేస్తారు. మనలను కంట్రోల్లో పెట్టాలని చూస్తారు. భయం, గిల్టీ, పశ్చాత్తాపం వదిలేస్తే... మీలో వచ్చే మార్పు అంతా ఇంతా కాదు. నిజానికి మహిళలం చాలా బ్లెస్డ్. ఒక్కసారి పిల్ల లను కనడమే ఓ సాహసం... అప్పటి బాధను మరిచి పోయి... మరోసారి ముందుకొస్తాం. ఆ శక్తి ప్రకృతి మనకిచ్చి,న గొప్ప వరం. నన్ను ఇది చేయనివ్వండి, అది చేయనివ్వండని ఎవరినో అడగాల్సిన పనిలేదు. నీలో ఏముందో నువ్వే గుర్తించు. నీవు కార్ డ్రైవ్చేయాలనుకుంటే... కార్ కడగటం నుంచి టైర్ మార్చడం వరకు నువ్వే నేర్చుకో. నువ్వు కార్ డ్రైవ్ చేసి.. టైర్ మార్చడానికి మరో మగాడి మీద ఆధారపడకు. ఆ ఆధారపడకపోవడంలో ఉండే సంతృప్తి వేరే ఉటుంది. ఆడ, మగా మధ్య శరీర నిర్మాణంలోతేడా ఉంది. అంతే తప్ప శక్తిలో కాదు. మనం బలహీనులమని...ఈ సమాజం మన మీద రుద్దింది.దాన్ని వదిలించుకోవాలి.