Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవరాశులలోకెల్లా అత్యంత భారీ బిడ్డనుకనే జంతువు తిమింగలం. ఇది కనేబిడ్డ దాదాపు తల్లి సైజులో సగం ఉంటుంది. 32 అడుగుల పొడవు ఉన్న ఒక జాతి తిమింగలం కడుపులో 14 అడుగుల 8 అంగుళాల పొడవు ఉన్న పిల్ల ఉంటుంది. 89 అడుగుల పొడవు ఉన్న నీలి 'తిమింగలం' కడుపులో 25 అడుగుల పొడవు ఉన్న పిల్ల ఉంటుంది. తిమింగలాలు నీళ్లలో ఉండటం వల్లనే ఇంత భారీ పిల్లను గర్భంలో మోయగలుగుతున్నాయి. నేలమీద తిరిగే జంతువులకు ఇది సాధ్యం కాదు. తిమింగలం పిల్ల అతి త్వరగా పెద్దది అవుతుంది. వేగంగా పెరుగుతుంది. తిమింగలం పిల్ల పొడవు ఒక్క సంవత్సరంలోనే రెట్టింపవుతుంది. రెండేళ్ల వయసు వచ్చేటప్పటికి సంపూర్ణంగా అభివృద్ధి చెంది పిల్లలను కనే స్థితికి వస్తుంది.