Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నపిల్లలు తిరిగే ఇల్లు శుభ్రంగా ఉండాలి. లేదంటే వారు వ్యాధులకు గురవుతారు. అందుకే ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఈ చిట్కాలు పాటించాలి.
- ప్రతిరోజూ ఇల్లంతా ఊడవడమే కాకుండా డెట్టాల్ నీళ్లలో ఒత్తాలి.
- చిన్నారిని పడుకోబెట్టే బెడ్షీట్ రెండు రోజులకొకసారి మార్చాలి.
- పిల్లల పాల సీసాలను నిత్యం వేడినీటితో శుభ్రం చేయాలి. బ్రెస్ట్ పంప్స్ కూడా పరిశుభ్రంగా ఉండేట్టు జాగ్రత్తపడాలి.
- చిన్నారికి వేసిన డైపర్ శుభ్రంగా ఉందా లేదా చెక్ చేసుకుంటుండాలి. అవసరాన్నిబట్టి వెంటనే దాన్ని మార్చి ఇంకొకటి వేయాలి.
- పాపాయి దుమ్ము, ధూళిలో ఆడకుండా చూసుకోవాలి.
- ఉదయం, పొద్దున్న మీ చిన్నారికి తప్పనిసరిగా స్నానం చేయించాలి.
- వేడినీటిలో ఉతికి ఆరేసిన బట్టలను పాపాయికి తొడగాలి.
- చిన్నారులకు తొడిగే బట్టల్ని మంచాలపై, కుర్చీలపై ఎక్కడ బడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పడేయకుండా బీరువాలో భద్రంచేయాలి.
- పాపాయి ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటుంది కాబట్టి ఇంట్లోని ప్రతి గదిలో దుమ్ము, ధూళి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గోడలకు బూజుల్లాంటివి సైతం లేకుండా చూసుకోవాలి. వారానికొకసారి ఇల్లు దులపాలి.
- బొద్దింకలు లాంటివి ఇంట్లో వద్ధి అవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు తడిగా లేకుండా చూసుకోవాలి.
- పాలు , కాఫీ తాగిన గ్లాసులు, టిఫిను ప్లేట్లు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా సింకులో పడేయాలి . అలా చేయకపోతే ఈగలు, దోమలు ఇంట్లో చేరే అవకాశముంది. ఇవి చిన్నారులను రకరకాలైన జబ్బులకు గురిచేస్తాయి.
- పసిపిల్లలకు తాగడానికి కాచి వడబోసిన నీళ్లనే ఇవ్వాలి. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయించాలి.