Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేసవిలో ఉక్కపోతకు పొట్టి, స్లీవ్‌లెస్ దుస్తులను ఉపయోగిస్తుంటారు. ఇవి స్టైల్‌గానూ ఉంటాయి. అయితే వీటివల్ల ఎండకు చర్మం ట్యాన్ అవుతుందని భయపడుతుంటారు. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే...
- వేసవిలో చర్మ సంరక్షణ జాబితాలో సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ఎస్.పి.ఎఫ్ 40 శాతం ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను పగటివేళలో బయటకు వెళ్లడానికి 15-30 నిమిషాల ముందు రాసుకోవాలి. దీనివల్ల సూర్యకాంతి నేరుగా శరీరం మీద పడడం వల్ల కలిగే హాని తగ్గుతుంది.
- పగటి వేలలో 3-4 సార్లు ఎలాంటి క్లెన్సర్లు వాడకుండా కేవలం నీటితోనే ముఖాన్ని, చేతులను, పాదాలను శుభ్రపరచుకోవాలి. దీనివల్ల చర్మానికి డీ-హైడ్రేషన్ సమస్య తలెత్తదు.
- ప్రతిరోజూ పగటి వేళలో కనీసం 15-20 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి. అప్పుడే చర్మం తన సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ను కోల్పోదు. త్వరగా పొడిబారదు.
- ఈతకొట్టేటప్పుడు నీటిలో క్లోరినే టెడ్ శాతం అధికంగా ఉంటే తప్పనిసరిగా మంచినీళ్లతో స్నానం చేయాలి.
- జిడ్డు చర్మం అయితే స్వేదగ్రంథులు ఈ కాలం మరింత జిడ్డును ఉత్పత్తి చేస్తాయి. ఇలాంటప్పుడు ఔషధమూలికలతో తయారైన ఫేస్‌ప్యాక్‌లతో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలి.
- పగటివేళ సూర్యకిరణాల ప్రభావం అధికంగా ఉంటుంది. అందుకని ఈ టైమ్‌లో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండడమే మేలు.
- మేకప్ వేసుకునేవారు మినరల్ మేకప్‌ని వాడటం మేలు. లేత రంగులు, చర్మానికి తగినంత చెమట పట్టేలా ఉండే సౌందర్య ఉత్పత్తులను వాడాలి.
- బయటకు వెళ్లేటప్పుడు కండ్లద్దాలు, టోపీ తప్పనిసరిగా ఉపయోగిస్తే 70 శాతం ఎండతాకిడి వల్ల కలిగే అనర్థాలను నివారించవచ్చు.