Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 43 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 31 డిగ్రీల సెల్సీయస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 43 డిగ్రీల సెల్సీయస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు. రబీ పంట కోతలను వాయిదా వేసుకోవాలి. కోసిన ధాన్యాన్ని మార్కెట్కు తరలించకుండా వాయిదా వేసుకోవాలి. ఇప్పటికే మార్కెట్కు తరలించిన ధాన్యాన్ని తడవకుండా చూసుకోవాలి.
వరి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడమైంది. నివారణకు 2గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మి.లీ క్లోరాంట్రినిల్ప్రోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుతం చలి మంచు వాతావరణం కనుక అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులను గమనించినట్టయితే నివారణకు ఎకరానికి 0.6గ్రా. ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మి.లీ ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ కాసుగామైసిన్ మందును లీటరు నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో కెండుసార్లు పిచికారి చేయాలి.
మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో పిందె రాలుట నివారణకు 0.25 మి.లీ ఎన్ఏఏ మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. మామిడిలో కాయ పరిమాణం పెరిగేందుకు 10 గ్రా. 13-0-45+1.25 గ్రా. బోరాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో బూడిద తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినట్టయితే నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 2 మి.లీ హెక్సాకొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
మిరప: మిరపలో తామర పురుగు, నల్లి ఉధృతి గమనించినట్టయితే నివారణకు 1.5 గ్రా. డిఫెన్థయూరాన్ లేదా 2 మి.లీ క్లోర్ఫినాపిర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో బూడిద తెగుళ్లు వ్యాప్తికి అనుకూలం. నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ డైనోకాప్ లేదా 1 మి.లీ అజాక్సిస్ట్రోబిన్ లేదా 0.4 గ్రా. మైక్లోబ్యుటానిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కూరగాయలు: ప్రస్తుత పొడి వాతావరణ పరస్థితులలో రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే సూచనలున్నాయి. నివారణకు ఫిప్రోనిల్ 2మి.లీ లేదా థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో ఆకుమాడు తెగులు సోకుటకు అనుకూలం. తెగులు నివారణకు 2.5 గ్రా. మ్యాంకోజెబ్ లేదా 1మి.లీ ప్రోఫికొనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఆలస్యంగా నాటిన టమాట పైరులో శనగ పచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1.25 మి.లీ నోవాల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాటలో తామర పురుగులు కూడా ఆశించేందుకు అనుకూలం. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
కోళ్ల యాజమాన్యం: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు టీకాలు వేయించాలి. కోళ్లు వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు షెడ్లల్లో ఫ్యాన్లను , ఫాగార్స్ను అమర్చాలి. షెడ్లపై వరిగడ్డితో కప్పి స్ప్రింకర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినేందుకు అనుగుణంగా మెత్తటి దానాను పెట్టి తాగేందుకు చల్లటి నీనిని అందుబాటులో పెట్టాలి.