Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటు న్నామని అనుకుంటాం.. కానీ .. ఆ క్రమంలో తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అవేంటోతెలుసుకుందాం మరి పొద్దటిపూట, రోజులో అప్పుడప్పుడూ ముఖం కడుగుతుంటాం. కానీ చాలా మంది రాత్రిళ్లు ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వరు. దీన్ని తేలిగ్గా తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, మురికి, జిడ్డు లాంటివి ముఖంపై పేరుకుని చర్మగ్రంథులు మూసుకుపోతాయి. దాంతో మొటిమలొస్తాయి. అలాగే ఎక్కువసేపు మేకప్‌ని తొలగించకపోవడం వల్ల చర్మంలో తేమ తగ్గి పొడిబారుతుంది. దాంతో ముఖంపై సన్నని గీతల్లాంటివి కనిపించడం మొదలవుతుంది.
- మెడా, ఛాతి భాగం, చేతులపైనా మచ్చలూ, ముడతలూ పడుతుం టాయి. చర్మమూ ఎర్రగా మారుతుంది. కాబట్టి ముఖంతో పాటూ, మెడా చేతులూ, ఛాతి భాగానికి సరిపోయే నాణ్యమైన మాయిశ్చరైజర్‌ని తప్పనిసరిగా రాసుకోవాలి.
చర్మం తెల్లగా కనిపించాలనే ఉద్దేశంతో ఒకటి రెండు కొత్త సౌందర్య ఉత్పత్తులను కలిపి వాడుతున్నారా! దీనివల్ల చర్మం ఎర్రగా కందిపోయి, అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఇలా జరగకూడదంటే ఒక ఉత్పత్తిని ఒకసారి మాత్రమే కొద్దిగా వాడి చూడాలి. ఎలాంటి అలర్జీ లేదనుకున్నప్పుడే మరో రకాన్ని ఎంచుకోవాలి. అన్నిటినీ ఒకేసారి వాడేసి సమస్యలు తెచ్చుకోకూడదు.