Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నారులకు డబ్బు విలువ గురించి చిన్నతనం నుంచే చెప్పాలి. అవసరాలూ, కోరికల మధ్య తేడా ఏంటో స్పష్టంగా వారికి అర్థమయ్యేలా వివరించాలి. తిండీ, దుస్తులూ, ఉండటానికి ఇల్లు లాంటివి ప్రాథమిక అవసరాలనీ, మిగతావన్నీ కోరికలని తెలియజేయాలి. పొదుపు, డబ్బు విలువ తల్లిదండ్రులే నేర్పించాలి.
ఒక్కసారిగా పిల్లల ఖర్చులకు కోతవేయడమో, అదుపు చేయాలనుకోవడం వల్లో చెడుమార్గంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. డబ్బు విలువ చిన్నతనం నుంచే చెప్పాలి. అవసరాలకూ, కోరికలకు మధ్య తేడా ఏంటో స్పష్టంగా వివరించాలి. తిండీ, దుస్తులూ, ఉండటానికి ఇల్లు లాంటివి ప్రాథమిక అవసరాలనీ, మిగతావన్నీ కోరికలని వారికి తెలియజేయాలి. మీ ఇంటి బడ్జెట్ను చూపుతూ ఈ రెండింటి మధ్య ఎంత లోటు ఉందో వారితోనే లెక్కలేయించండి. ఇవన్నీ వారికి డబ్బు వినియోగంపై అవగాహన పెంచుతాయి.
మీరు వారి ఖర్చులకు ఇచ్చే వాటిల్లో కొంత మొత్తాన్ని పొదుపు చేసేలా ప్రోత్సహించండి. వారికి నచ్చే ఆక తుల్లో ఇలాంటి హుండీలెన్నో దొరుకుతున్నాయి. ఒకటి బహుమతిగా ఇవ్వండి. కొంచెం పెద్ద పిల్లలైతే వారిపేరు మీద సొంత ఖాతా తెరచి ప్రతినెలా వారిచేత డబ్బులు జమ చేయించండి. ఇప్పుడు చాలా బ్యాంకులు పిల్లలకు కూడా ఖాతా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
చిన్నారులూ ప్రతి విషయం తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. చాలాసార్లు అమ్మానాన్నలను అనుకరిస్తారు. కూడా కాబట్టి డబ్బు- పొదుపు విషయంలో మీరూ కచ్చితంగా ఉండండి. నెల ప్రారంభంలో ఆరాÄటాేలకు పోయి ఉన్న డబ్బంతా ఖర్చుచేసి నెల చివర దంపతులిద్దరూ కీచులాడుకోవద్దు. ఇది చిన్నారులపైనా ప్రభావం చూపిస్తుంది. దీనికితోడు వారి కోరికల జాబితా, విలాసాల మోజూ పెరుగుతుంది.
పిల్లలకు డబ్బులు ఇవ్వడం మంచిది కాదు అని చాలామంది చెబుతారు. అయితే ఇందులో నిజం లేదు. వారికి పొదుపు అలవాటు చేయాలన్నా, డబ్బు విలువ తెలియాలన్నా ఎంతోకొంత ఇవ్వాల్సిందే. వీటితో పాటు తమకు కావలసిన వస్తువులు కొనుక్కునేందుకు వారంతటవారే ఆ మొత్తాన్ని సంపాదించుకునేలా చేయండి. సెలవురోజుల్లో చిన్నచిన్న పనులు చేస్తూ డబ్బు వాళ్లే సంపాదించుకునేలా చూడాలి. అలానే వారి దగ్గర రూపాయి ఉన్నా సరే! దాన్ని వినియోగించిన విధానం తప్పనిసరిగా పుస్తకంలో రాసుకోమనండి. ఇలా వారి లెక్కలో స్పష్టత ఉంటే ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. వారాంతంలో ఒకసారి చూసుకుంటే దేనికోసం ఎంత ఖర్చుపెడుతున్నారో వారికి తెలుస్తుంది. అనవసర ఖర్చూలూ కూడా తెలిసిపోతాయి. దుబారా చేస్తే కోప్పడకుండా ఆ డబ్బు ఎలా నిరుపయోగంగా మారిందో చెప్పండి. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా ఇదో గుణపాఠంలా వారికి గుర్తుంటుంది.
మనమంతా దేనికోసం ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నాం? సంపాదన ఎందుకు? వీటిపై అవగాహన కల్పించాలి. నేను పనిచేస్తున్నా కాబట్టే నువ్వు ఈ షఉస్ కొనుక్కోగలిగావ్.. మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం.. అని చెప్పాలి. మీ వ త్తితో పాటూ ఇతర వ త్తులు చేసేవారి గురించి వారికి పరిచయం చేయాలి. ఒక డాక్టర్ పనివేళలు ఎలా ఉంటాయి? ఒక సాధారణ ఉద్యోగి పనివేళలూ అతని సంపాదన వివరాలూ చెప్పాలి.