Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల్యంలో చిన్న చిన్న వంట గిన్నెలతో ఆడుకోవడం అమ్మాయిలందరికీ అనుభవమే! కానీ.. అదే గిన్నెల్లో చిన్న చిన్న ఆహార పదార్థాలు చేసిపెట్టడం ఓ పిల్లలందరికీ ఓ కల. ఆ కలను ఆమె నిజం చేసింది. అవి నిజమైనవి కావు... అదో ఆర్ట్! చిటికిన వేలుపై పట్టే ఇడ్లీ... వేలు చివరన నిలబడేంత ఫ్రైడ్ చేపముక్క.. ఒకటేమిటి అరచేతిలో తాలీ వడ్డించేస్తున్నది. ఈ ఫుడ్క్రాఫ్ట్తో మినియేచర్రంగంలో తనదైన ముద్ర వేసుకున్న
అగ్నికా బెనర్జీ పరిచయం...
వస్తువుల్ని ఉండ్సాలిన పరిమాణంలో కంటే సూక్ష్మంగా చూపేదే మినియేచర్. అగ్నికా బెనర్జీ అనే యువతి ఫుడ్ మినియేచర్తో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. సూక్ష్మరూపంలో ఇడ్లీ, పూరీ, పప్పు.. ఇలా ఒక్కటేమింటి రకరకాల పదార్థాలను ఆమె రూపొందించింది. చూస్తేనే నోరు ఊరించేలా.. చాలా చిన్న పరిమాణంలో వీటిని తయారు చేయడం విశేషం.
మేనేజ్మెంట్లో పీజీ..
భువనేశ్వర్‌కు చెందిన అగ్నిక ప్రస్తుతం ఉండేది కోల్‌కతాలో. సైకాలజీలో డిగ్రీ చదివింది. తరువాత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో పీజీ చేసింది. ఓ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో కొంతకాలం పనిచేసింది. ఆ పనిలో జీవం లేదనిపించిందామెకె. ఏదో మొనాటనీ. అలాగని దాన్ని వదిలేసి ఏం చేయాలో స్పష్టత లేదు. వాళ్లమ్మ పుట్టిన రోజుకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. చిన్నప్పటినుంచి అగ్నికకు మినియేచర్ అంటే ఇష్టం. చాలా మినియేచర్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంది కూడా. మినియేచర్లోనే ఏదైనా చేసి కానుకగా ఇవ్వాలనుకుంది. అది కూడా ఓ కేక్ అయితే బాగుంటుందని భావించి.. క్లే తీసుకొచ్చింది. క్లేతో మినియేచర్ ప్రాసెసింగ్ అంతా ఆన్లైన్లో నేర్చుకుంది. అలా మొత్తానికి బొమ్మ కేక్‌ను అమ్మ బర్త్‌డేనాడు కానుకగా ఇచ్చింది. పుట్టినరోజు వేడుకకు వచ్చినవాళ్లే కాదు.. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ అది చూసి మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకోళ్లు ఆమెను మినియేచర్వైపు ముందడుగు పడేలా చేశాయి.
వన్‌మేన్ ఆర్మీ..
ఇప్పటిదాకా రకరకాల మినియేచర్స్ చూసింది. పిల్లల బొమ్మ ఇళ్లయితే రకరకాలున్నాయి. కానీ... ఫుడ్ మినియేచర్స్ లేవు. తానెందుకు ఫుడ్ మినియేచర్లోకి అడుగుపెట్టకూడదనుకుంది. అనుకున్నదే తడవుగా 2017లో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి... ఫుల్‌టైమ్ క్రాఫ్ట్ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. డిసెంబర్లో అగ్నిక క్రియేషన్స్ పేరుతో తన బ్రాండ్‌ను ఆన్లైన్లో లాంచ్ చేసింది.అమేజాన్, ఇ-కామర్స్, ఎస్టీ వంటివాటిలో ఆమె మినియేచర్ క్రాఫ్ట్ కొనడానికి అందుబాటులో ఉంది. కాన్సెప్ట్ నుంచి స్కెచ్చింగ్, క్లే మౌల్డింగ్, కలరింగ్, ప్యాకింగ్ వరకూ అన్నీ తనే చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... అగ్నిక క్రియేషన్స్‌కి వన్‌మేన్ ఆర్మీ ఆమె. కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు.. ఆ ఫుడ్ మినియేచర్తో చెవి రింగులు, కీ చెయిన్స్ కూడా తయారు చేస్తున్నది.
విదేశాల నుంచి ఆర్డర్లు..
బెంగాలీ ఫుడ్ మినియేచర్ ఫ్రిడ్జ్ మాగెట్ను తయారు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు అగ్నిక డెలివరీ చేస్తోంది. రోల్, ఆలూ ఫ్రై, హిలస చేప, ఫిష్ ప్రై, పాయసం తదితర వంటకాలను సూక్ష్మ పరిమాణంలో నోరూరించేలా ఆమె తయారు చేస్తోంది. లండన్, ఇటలీ, స్పెయిన్, సింగపూర్, సౌత్ కొరియాల నుంచి కూడా అగ్నికకు ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది వీటిని చూసి నిజంగా తినేవేనా అని అడుగుతున్నారట. వాస్తవానికి ఆమె వాటిని ఎండు మట్టితో రూపొందిస్తోంది. కానీ అచ్చం తినే పదార్థాల్లాగే కనిపించేలా చేయడం ఆమె స్పెషాలిటీ. ఆమె దగ్గర మినియేచర్ లైబ్రరీనే ఉంది.