Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జుట్టు విపరీతంగా ఊడిపో తుంటే.. బంగాళాదుంప, కలబంద రసాలను ఒక్కోటి మూడు టీస్పూన్ల చొప్పున, 21 టీస్పూన్ల తేనెలను తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు అంతటా పట్టించి రెండు గంటలు ఉంచుకోవాలి. ఆ తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే ఫలితం కనపడుతుంది.
- ఆలుగడ్డ తురుమును పిండితే వచ్చిన రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో గుడ్డు సొన, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ను కుదుళ్ల నుంచి జుట్టంతా పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగి షాంపూతో తలస్నానం చేయాలి. ఇరవై రోజులకి ఒకసారి ఇలా చేస్తే ఆర్యోగవంతమైన మెరిసే జుట్టు సొంతమవుతుంది.
- ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడిచేయాలి. అవి ఉడుకుపట్టగానే బంగాళా దుంప పొట్టు వేసి ఇరవై నిమిషాలు ఉడికించాలి. ఆ నీటిని వడకట్టాలి. షాంపూతో తలస్నానం చేశాక వడకట్టిన నీళ్లతో జుట్టు కడగాలి. ఇది జుట్టుకు సహజసిద్ధమైన నలుపు రంగుని ఇస్తుంది. ఇలా చేస్తుంటే జుట్టు తెల్లబడే సమస్య నుంచి బయటపడొచ్చు.