Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరటిపండు తింటే లావైపో తామని చాలామంది దానికి దూరంగా ఉంటారు. కానీ దానిలో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. అలాగే తిన్న తరువాత త్వరగా శక్తినిచ్చే అరటి పండు గురించిన మరిన్ని ఉపయోగాలు...
అరటి పండులో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. దీనివల్ల గ్రహణ శక్తి పెరుగుతుంది. అదేవిధంగా హైబీపీని కూడా నియంత్రించవచ్చు. అలాగే అరటిపండులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియ వల్ల ఎముకలు గట్టిపడతాయి. ఎముకల దఢత్వానికి అవసరమైన కాల్షియాన్ని పీల్చుకోవడంలో ఈ బ్యాక్టీరియం సహకరిస్తుంది.
నీళ్ల విరోచనాల వల్ల కోల్పోయిన శక్తి, అరటి పండు తినడం ద్వారా తిరిగిపొందవచ్చు. శరీరంలో గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేసే ఎంజైములు విడుదల కావడంలో అరటి పండు ఉపయోగపడుతుంది. హానికరమైన క్రిములనుంచి రక్షణ కల్పిస్తుంది.
మీడియం సైజులో ఉండే అరటిపండులో 0.37 మిల్లీగ్రాముల విటమిన్-బి6 ఉంటుంది. విటమిన్ బి-6 అధికంగా లభించే పదార్థాలు తినడంవల్ల గుండె జబ్బుల బారినపడే అవకాశం చాలా తక్కువ.
ఎసిడిటీని తగ్గించే గుణం అరటిపండుకి ఉంది. కడుపులో మంటను నివారించే సహజసిద్ధ యాంటాసిడ్‌గా అరటిపండు పనిచేస్తుంది.